మెగా ప్రిన్స్ కు కలిసొస్తున్న క్లాష్ సెంటిమెంట్

Update: 2019-02-27 11:35 GMT
సినిమా పరిశ్రమలో కొన్ని కాకతాళీయంగా అనిపించినా వాటికో సెంటిమెంట్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే మన దర్శక నిర్మాతలు ముహూర్తం మొదలుకుని ట్రైలర్ రిలీజ్ సినిమా విడుదల దాకా ఇలా ప్రతి ఒక్కటి క్యాలికులేటెడ్ గా చేస్తారు. అఫ్ కోర్స్ ప్రతిసారి ఇలాగే వర్క్ అవుట్ అవుతాయని కాదు కాని అధిక సందర్భాల్లో నిజమయ్యేవి ఎక్కువగా ఉంటాయి.

ఇక విషయానికి వస్తే కెరీర్ స్టార్టింగ్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెల్లగా దారిలో పడుతున్నాడు. గత ఏడాది తొలిప్రేమ ఈ సంవత్సరం ఎఫ్2 ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుని మంచి ప్లానింగ్ తో వెళ్తున్నాడు. అయితే వరుణ్ కు కీలకంగా నిలిచిన ఈ రెండు సక్సెస్ ల వెనుక ఒక మెగా క్లాష్ సెంటిమెంట్ ఉంది. అదేంటో మీరే చూడండి

పోయిన సంవత్సరం తొలిప్రేమ రిలీజ్ టైంలో సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్ తో ఒకే తేదికి క్లాష్ వచ్చి పడింది. ఇలా చేయడం మంచిది కాదన్న ఆలోచనలో తొలిప్రేమను ఒకరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 10 శనివారం విడుదల చేసారు. తీరా చూస్తే ఇంటెలిజెంట్ డిజాస్టర్ కాగా తొలిప్రేమ ఇక్కడే కాదు ఓవర్సీస్ లో సైతం విజయకేతనం ఎగరేసింది.

ఇక ఈ సంక్రాంతికు వరుణ్ తేజ్ ఎఫ్2 రెడీ అయ్యింది. 12 డేట్ ఫిక్స్ చేయగా దానికన్నా ఒక్క రోజు ముందు అన్నయ్య చరణ్ వినయ విధేయ రామ వచ్చింది. రిజల్ట్ సేం. అది డిజాస్టర్ కాగా ఒక రోజు ఆలస్యంగా శనివారం వచ్చిన ఎఫ్2 ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ రెండు సందర్భాల్లో వరుణ్ తేజ్ కు పోటీ ఉన్నది మెగా హీరోలే కావడం గమనార్హం. కొన్ని అంతే ఇలాగే వింతగా అనిపించినా సెంటిమెంట్ టచ్ కూడా కనిపిస్తుంది
Tags:    

Similar News