ఆగస్ట్ 15న కంచె టీజర్ ఎందుకు రిలీజ్ చేశారో... ఆ వీడియోని చూస్తే అర్ధమవుతుంది. స్వతంత్రం రాకముందు.. అంటే 1940లనాటి కథ తీసుకుని.. ఈచిత్రాన్ని రూపొందించారు విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఈ మూవీ రూపొందింది. మాంచి ఒడ్డూ పొడుగూ ఉండడంతో సైనికుడి గెటప్ లో వరుణ్ తేజ్ సూపర్ గా సెట్ అయిపోయాడు. అలాగే తెలుగులో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన సీన్స్ వచ్చి చాలా కాలమైంది. అది కూడా క్రిష్ లాంటి దర్శకుడు తీస్తే... వాటిలో రియాలిటీ కనిపిస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధాన్ని మెస్మరైజ్ అయ్యేలా షూట్ చేశారు కంచె లో. లెటర్ రాసుకుంటున్న సీన్ తో మొదలుపెట్టి... యుద్ధంలో యాక్టివ్ గా పాల్గొనడం, హీరో వెనకే పెద్ద బాంబు పేలడం... ఇలా కంచె టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. క్రిష్ నుంచి మరో క్రియేషన్ చూడబోతున్నామని నిరూపించింది. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది కంచె.
30 సెకన్ల టీజర్ తోటే అందరినీ కట్టిపడేసింది కంచె. వరుణ్ తేజ్ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో. 1940నాటి సన్నివేశాలను రియలిస్టిక్ గా చిత్రీకరించారని... ప్రతీ ఒక్కరిలో భావోద్వేగాలను రగిలించే చిత్రం ఇదని అంటోంది సినిమా యూనిట్. స్వతంత్ర దినం రోజున ఇలాంటి టీజర్ ఇచ్చినందుకు కంచె టీంకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.