ట్రెండీ టాక్‌: టాలీవుడ్ హృతిక్ అనుకోవ‌చ్చా?

Update: 2021-04-19 16:30 GMT
కండ‌లు ఎవ‌రైనా పెంచుతారు. కానీ అంద‌రూ హృతిక్ లు కాలేరు. తెలుగు చిత్ర సీమ వ‌ర‌కూ చూస్తే .. న‌వ‌త‌రం హీరోలంతా 6 ప్యాకింగుల‌తో కండ‌లు పెంచి కండ‌ర‌గండ‌ళ్లుగానే మారారు. కానీ వీళ్లంద‌రిలో ఒడ్డు పొడుగు ఆహార్యం లుక్ వైజ్ చూస్తే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ జ‌నం గుండెల్లో వేసే ముద్ర‌ వేరు.

ఆరడుగుల క‌టౌట్ దానికి త‌గ్గ‌ట్టే సూదంటు ముక్కుతో అత‌డి రూపం చాలా స్పెష‌ల్. మెగా కాంపౌండ్ లో ఇత‌ర హీరోలంతా అత‌డిని గ్రీకువీరుడు అని పిలుస్తారంటే అత‌డికి ఉండే ఇమేజ్ ని అర్థం చేసుకోవ‌చ్చు. రామ్ చ‌ర‌ణ్‌.. తొలిత‌రం 6ప్యాక్ హీరోగా ఏలిన అల్లు అర్జున్ .. వీళ్లంద‌రి కంటే భిన్న‌మైన లుక్ అత‌డి సొంతం. ఇక క‌థ‌ల  ఎంపికల ప‌రంగానూ యూనిక్ స్టైల్ తో వెళుతున్నాడు. త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన దారి ఉంద‌ని ప్ర‌యోగాల‌తో నిరూపించాడు.

ఇప్పుడు ఏకంగా కండ‌లు పెంచి బాక్సింగ్ రింగ్ లోకి దిగుతున్నాడు. ఇదంతా కిర‌ణ్ కొర్ర‌పాటి బాక్సింగ్ నేప‌థ్య సినిమా `గ‌ని` కోస‌మే. వ‌రుణ్ కెరీర్ ప‌ద‌వ చిత్ర‌మిది. అందుకే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఇటీవ‌ల అత‌డు భీక‌రాకారుడిగా మారిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. జిమ్ లో వ‌రుణ్ తేజ్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తూ లుక్ మొత్తం మార్చేశాడు. బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ ఇంత‌గా శ్ర‌మిస్తార‌ని విన్నాం. మ‌ళ్లీ వ‌రుణ్ లో అంత క‌సి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతానికి ఒడ్డు పొడుగు లుక్ ప‌రంగా అత‌డినే టాలీవుడ్ హృతిక్ అని భావించాల్సి ఉంటుంది.

తాజాగా అత‌డు కాఫీ టేబుల్ వ‌ద్ద రిలాక్స్ మోడ్ లో ఏదో ఆలోచిస్తూ ఉన్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. అత‌డి మారిన లుక్ ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. బైసెప్ బాగా మారింది. షోల్డ‌ర్ షేప‌ప్ అయ్యింది. ప‌క్కాగా ఫిట్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. ఒక ర‌కంగా అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిలా గ్రీకువీరుడిలా మారిపోయాడు వ‌రుణ్. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News