మెగా హీరోకి రెండూ మిస్ అయ్యాయే..

Update: 2015-09-25 11:30 GMT
జోష్ లో ఉన్న టాలీవుడ్ ని క్యాష్ చేసుకోడానికి.. చిన్న పెద్ద సినిమాలన్నీ వరుసగా క్యూ కట్టాయి. అదృష్టం పరీక్షించుకుంటూ.. అనూహ్యమైన హిట్స్ కూడా సాధించేస్తున్నాయి. భలేభలే మగాడివోయ్ లాంటి మీడియం బడ్జెట్ మూవీ - మయూరి లాంటి లో బడ్జెట్ పిక్చర్ లు కూడా బ్లాక్ బస్టర్స్ అనిపించేసుకున్నాయి. కానీ ఈ జోష్ ని, దసరా సీజన్ ని రెండింటినీ మిస్ చేసేసుకున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.

నిజానికి ఈ మెగావారసుడివి రెండు మూవీస్ ఈ సీజన్ లో రిలీజ్ అవుతాయని అనుకున్నారు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన కంచె ఒకటి కాగా.. పూరీ తీస్తున్న లోపర్ రెండోది. అన్నీ పూర్తి చేసుకున్న కంచె అనూహ్యంగా దీపావళికి పోస్ట్ పోన్ అయింది. కనీసం వాయిదాకి రీజన్  కూడా చెప్పలేదు కంచె యూనిట్. ఇక మెగాస్టార్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేయడం మానేసి మరీ... లోఫర్ మొదలుపెట్టేశాడు పూరి జగన్నాధ్. మూడు నెలల్లో రిలీజ్ చేసేస్తానని జూన్ లోనే చెప్పాడు. అయితే.. ఈ లోఫర్ సంగతులు, అప్ డేట్స్ వినిపించడం కూడా లేదు.

ఎంతవరకూ తీశాడో, ఎప్పుడు రిలీజ్ చేస్తాడో చెప్పడం లేదు పూరి. దీంతో పండగ సీజన్ ని పూర్తిగా మిస్ అయిపోయాడు వరుణ్ తేజ్. సూటిగా చెప్పాలంటే.. రెండు ఎటెంప్ట్ లు ఫెయిల్ అయిన పరిస్థితి ఈ మెగా హీరోది. మూడేళ్లుగా మూలబెట్టిన కొరియర్ బాయ్ కళ్యాణ్ వచ్చేసేంతటి బూమ్ లో ఉంది ఇప్పుడు మన తెలుగు పరిశ్రమ. మరి వరుణ్ తేజ్ కి మాత్రం ఈ సీజన్ కలిసిరాలేదు ఎందుకో.
Tags:    

Similar News