అదేంటో మరి.. జూన్ నెలలో మెగా డాటర్ నిహారిక ''ఒక మనసు'' రిలీజ్ అయిపోయాక.. వెంటనే స్పెయిన్ చెక్కేయడమే అన్నారు. కాని అన్నయ్య మాత్రం ఇంకా షూటింగ్ మొదలెట్టలేదు. ఒక ప్రక్కన శేఖర్ కమ్ముల తన సినిమా కోసం ఆడిషన్లు అవీ ఇవీ అంటూ దూసుకుపోతుంటే.. శ్రీను వైట్ల మాత్రం వరుణ్ తేజ్ తో చేయాల్సిన సినిమాను ఇంకా స్టార్టే చేయలేదు. వై దిస్ కొలవెరి?
జూన్ 27న ఫ్లయిటెక్కేసి స్పెయిన్ వెళిపోయి.. షూటింగ్ మొదలెట్టేస్తున్నాం అని ఈసారి స్వయంగా వరుణ్ తేజ్ ప్రకటించాడు. అమెరికా టూర్ నుండి తిరిగి రాగానే మనోడే డీటైల్స్ మీడియాకు ఇచ్చాడు. కాని జూన్ 27 దాటేసి.. యునిట్ సభ్యులు చెప్పిన జూలై 5 అనే కొత్త డేట్ కూడా దాటిపోతోంది కాని.. ఇంతవరకు ''మిష్టర్'' సినిమా పట్టాలెక్కిందే లేదు. మధ్యలో సైమా అవార్డులకు వెళ్ళొచ్చాడు కాని.. ఈ సినిమా గురించి మాత్రం అప్డేట్ ఇవ్వట్లేదు వరుణ్ తేజ్. ఇంతకీ ఈ మిష్టర్ బాబుకు వచ్చిన తిప్పలేంటి బాబూ? కేవలం వీసా విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేకపోతే స్ర్కిప్టు కథలు ఇంకా ఒక కొలిక్కి రాలేదా అనే సందేహం రాక మానదు మరి.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా కోసం డేట్లిచ్చి వెయిట్ చేస్తున్న లావణ్య త్రిపాఠి - హెబ్బా పటేల్ మాత్రం.. ప్రొడక్షన్ యునిట్ నుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. హేయ్ మిష్టర్.. విషయం చెప్పు!!