వ‌రుణ్ సినిమా సూప‌ర్ స్టార్ రేంజ్ లో?

Update: 2022-07-07 02:30 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ని 'గ‌ని' ఫ‌లితం నిరుత్సాహ ప‌రిచిన‌ప్ప‌టికీ ఆ ప‌రాజ‌యం నుంచి వేగంగానే కోలుకున్నాడు. 'ఎఫ్-3' రూపంలో మ‌రో భారీ విజ‌యం అందుకోవ‌డంతో 'గ‌ని' ప‌రాభ‌వం పెద్ద‌గా ప్రభావం చూప‌లేదు. యాక్ష‌న్ స్టార్ ఇమేజ్ కోసం గ‌ని సినిమా చేసాడు. అందుకోసం ఎంతో శ్ర‌మించాడు. బాక్స‌ర్ లుక్ కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు.

ఏకంగా విదేశాలు వెళ్లి  మ‌రీ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. లుక్ ప‌రంగా ట్రాన్స‌ప‌ర్మేష‌న్ కోసం డైట్..జిమ  ఇలా ప్ర‌తీ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త తీసుకున్నాడు. కానీ ఫ‌లిత‌మే  నిరుత్సాహ ప‌రిచింది. కానీ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ఏదో రోజు త‌ప్ప‌క దొరుకుతుంద‌న్న‌ది! అంతే వాసస్త‌వంగా న‌మ్మాలి. అవును అప్పుడు ప‌డిన క‌ష్టం ఇప్పుడు వ‌రుణ్ తేజ్ కి ఉప‌యోగ కరంగా మారుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్పై నేప‌థ్యంతో తెర‌కెక్కుతుంది. క‌థ పూర్తిగా లండ‌న్ నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో వ‌రుణ్ తేజ్  ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెంట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడని స‌మాచారం. ఇప్పుడీ గుఢాచారి పాత్ర కోసం వ‌రుణ్ మ‌రోసారి జిమ్మ్ లో క‌స‌రత్తులు షురూ చేసిన‌ట్లు తెలిసింది.

ఇప్ప‌టికే సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ ప‌నులు పూర్త‌య్యాయి. వ‌రుణ్ లుక్ ప‌రంగా కొంత మార్పు తీసుకొచ్చిన వెంట‌నే సెట్స్ కు వెళ్ల‌డ‌మే ఆల‌స్య‌మ‌ని తెలుస్తోంది. స‌రిగ్గా 'గని' కోసం ప‌డిన క‌ష్ట‌మే ఇప్పుడీ ప్రాజెక్ట్ కి ప‌నికోస్తుంది. సిక్స్ ప్యాక్  లుక్ లోకి మార‌డానికి ఆ నాటి క‌ష్ట‌మే ఇప్పుడు సుల‌భ‌త‌రం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. జిమ్ లో వ‌ర్కౌట్లు చేయ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీగా ఉంద‌ని..శ‌రీరంలో మార్పులు రావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌లేద‌ని క్లోజ్ సోర్సెస్ ద్వారా  తెలిసింది.

అలాగే సినిమా గురించి మ‌రో షాకింగ్ విష‌యం కూడా బ‌య‌ట‌కి వ‌స్తుంది. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా భారీ బ‌డ్జెట్ తో  నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం.  వ‌రుణ్ తేజ్ మార్కెట్ ఫ‌రిదిని మించి ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిసింది. దాదాపు 80 నుంచి 100 కోట్ల మ‌ధ్య‌లో  నిర్మాణ వ్య‌యంగా కేటాయించిన‌ట్లు సోర్సెస్ చెబుతున్నాయి.

అదే నిజ‌మైతే వ‌రణ్ తో ప్రాజెక్ట్ కాస్త రిస్క్ జోన్ లో ఉన్న‌ట్లే. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌రుణ్ పై ఈ స్థాయి బ‌డ్జెట్ ని ఏ నిర్మాణ సంస్థ కేటాయించ‌లేదు. 25 కోట్ల నుంచి 50 కోట్ల మ‌ధ్య‌నే నిర్మాణం జ‌రిగాయి. బాక్సీఫీస్ వ‌సూళ్లు ప‌రంగానూ వ‌రుణ్ సోలో సినిమాలేవి ఇప్ప‌టివ‌ర‌కూ 100 కోట్ల క‌బ్ల్ లోనూ చేర‌లేదు. 'ఎఫ్-2' ప్రాంచైజీ 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన‌ప్ప‌టికీ ఆ క్రెడిట్ లో వెంక‌టేష్‌కి భాగ‌ముంది.

కాబ‌ట్టి పూర్తిగా వ‌రుణ్ ఖాతాలో వేయ‌డానికి ఛాన్స్ లేదు. మ‌రి  ఇప్పుడు ఎనిమిదేళ్ల జ‌ర్నీ అనంత‌రం 100 కోట్ల క్ల‌బ్ లో చేరే ప్రాజెక్ట్ వ‌రుణ్ చేతికొచ్చింది. మ‌రి ఈఛాన్స్ ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం  చేసుకుంటాడో చూడాలి. మేక‌ర్ గా ప్ర‌వీణ్ స‌త్తారుత కి మంచి పేరుంది.
Tags:    

Similar News