మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల ఎంపికలో డిఫరెంట్ ఎటెంప్ట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఆరంగేట్రమే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద చిత్రంలో నటించాడు. స్లోఫేస్ సినిమా అయినా తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే కథాంశాన్ని ఎంచుకున్నాడని ప్రశంసలొచ్చాయి. సేమ్ టైమ్ పూర్తి స్థాయి కమర్షియల్ ఎటెంప్ట్ కాదని విమర్శల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. సరే .. ఇక రెండో సినిమా అయినా దేశముదురులా ఎటెంప్ట్ చేస్తాడనుకుంటే పూరీని వదిలేసి, క్రిష్ వెంట పడ్డాడు. అతడి దర్శకత్వంలో కంచె చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ సినిమా పోస్టర్లు చూస్తుంటే ఇదో విలక్షణమైన ప్రయత్నం. మరో ప్రయోగం అనే అనిపిస్తోంది. స్వాతంత్య్రం రాక ముందే జరిగిన కథతో క్రిష్ ఓ కొత్త ఎటెంప్ట్ చేస్తున్నాడు. క్రిష్ లోని ట్యాలెంటును తక్కువ అంచనా వేయడం లేదు కానీ, వరుణ్ తేజ్ ని ఆశించినంత కమర్షియల్ కోణంలో చూపిస్తున్నాడా? మాస్ ని మెప్పిస్తాడా? అన్న సందేహాలు మెగాభిమానుల్లో ఉన్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం విజువల్ తోనే చెప్పాలి అతడు. ఇక మూడో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉంటుంది. అది పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందనడంలో సందేహమే లేదు. కాలమే సమాధానం చెప్పాలి. వెయిట్ అండ్ సీ.