సినీ కుటుంబాలకు చెందిన చిన్న పిల్లలు.. బాల నటులుగా తళుక్కుమనడం మామూలే. చిన్న పిల్లలు చేయాల్సిన పాత్రలేవైనా ఉంటే.. సినీ ఫ్యామిలీస్ నే వాకబు చేస్తుంటారు. తర్వాతి రోజుల్లో హీరోలుగా మారిన చాలామంది ఒకప్పుడు బాలనటులుగా కనిపించిన వాళ్లే. మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కు కూడా అలాంటి అవకాశాలు వచ్చాయట. చిన్న పిల్లాడిగా ఉండగా విక్టరీ వెంకటేష్ తోనే ఒకటికి రెండుసార్లు కలిసి నటించే అవకాశం వచ్చిందని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేక పోయానని వరుణ్ స్వయంగా వెల్లడించాడు. వరుణ్... ప్రస్తుతం వెంకీతో కలిసి ‘ఎఫ్-2’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్లో వరుణ్ మాట్లాడాడు.
వెంకీ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లాడు’లో ఆయన కొడుకుగా గడుసు పిల్లాడి పాత్ర కోసం ముందు తననే అనుకున్నట్లు వరుణ్ చెప్పాడు. కానీ ఆ సినిమా చేయలేకపోయానన్నాడు. తర్వాత ‘వాసు’లో వెంకీ తమ్ముడి పాత్రకు వరుణ్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పటికి వరుణ్ మరీ లావుగా ఉండేవాడట. ఆ పాత్రకు సెట్టవడని వెనక్కి తగ్గారట. అలా రెండుసార్లు వెంకీతో నటించే ఛాన్స్ మిస్సయ్యానని.. ఐతే హీరో అయ్యాక ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.ఈసారి వెంకటేష్ తో సినిమా అనగానే.. తన పాత్ర ఏమిటి? కథ ఏమిటి? అని కూడా అడగకుండా ఒప్పుకున్నానని.. ఇక ముందూ అలాగే చేస్తానని.. వెంకీ అంటే తమ అందరికీ డార్లింగ్ అని వరుణ్ విక్టరీ హీరో పై ప్రశంసల జల్లు కురిపించాడు.
Full View