బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న పాపులర్ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో 'లైగర్' జోడీ విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్నా తో డేటింగ్ రూమర్స్ పై VD స్పందించారు.
'గీత గోవిందం' 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ - రష్మిక.. డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తరచుగా ముంబై వీధుల్లో కలిసి చక్కర్లు కొడుతూ కెమెరా కళ్ళకు చిక్కడంతో.. వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
రష్మక - విజయ్ ఇద్దరూ ఇప్పటికే తమపై వస్తున్న పుకార్లను ఖండించారు. తామిద్దరం స్నేహితులమే అని చెప్పుకొంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఈ రూమర్స్ కు చెక్ పడలేదు. ఈ నేపథ్యంలో 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది.
రష్మిక తో డేటింగ్ రూమర్స్ పై కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తను నా డార్లింగ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్. తామిద్దరం ఒకేసారి కెరీర్ ను ప్రారంభించామని.. కలిసి సినిమాలు చేసే క్రమంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని.. తాము మంచి స్నేహితులమని VD తెలిపారు.
''నా కెరీర్ ప్రారంభంలోనే రష్మికతో కలిసి రెండు సినిమాలు చేశాను. షూటింగ్ లో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్ గురించి.. జీవితంలోని కష్టసుఖాలపై ఎప్పుడు మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం'' అని విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే 'ప్రేమలో ఉన్నావా?' అని కరణ్ ప్రశ్నించగా.. నేను పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు గట్టిగా సమాధానం చెబుతా. అప్పటివరకూ ఈ విషయంపై ఏం మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు విజయ్. ఒక యాక్టర్ గా ఇప్పుడు ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. వాళ్ల మనసులో నాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇంట్లో గోడలపై నా పోస్టర్లు.. ఫోన్ వాల్ పేపర్స్ పై నా ఫొటోలు పెట్టుకుని నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్పి వాళ్ల మనోభావాలు దెబ్బతీయాలనుకోవడం లేదు అని VD అన్నారు.
ఈ క్రమంలో చివరిసారిగా ఎప్పుడు సెక్స్ చేశారు? పబ్లిక్ ప్రదేశాల్లో మీరెప్పుడైనా చేశారా? అంటూ కరణ్ ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగాడు. దీనికి విజయ్ స్పందిస్తూ తాను ఓ సమయంలో చిన్న పడవలో శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇక అనన్య పాండేతో తాను డేట్ కు వెళ్లానని.. కాకపోతే అది కేవలం ఫ్రెండ్లీ డేట్ మాత్రమేనని చెప్పాడు.
జాన్వీ కపూర్ క్యూట్ గా ఉంటుందని.. పలుమార్లు ఆమెను బయట కలిశానని విజయ్ చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రణ్ వీర్ సింగ్ లా నగ్నంగా ఫొటోలు దిగాల్సి వస్తే ఒప్పుకొంటారా? అని కరణ్ అడగ్గా.. అలాంటి ఫొటోషూట్ లో పాల్గొనడానికి తాను ఇబ్బందిపడనని విజయ్ స్పష్టం చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ ''లైగర్'' కోసం దూకుడుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పూరీ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఆగస్ట్ 25న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది.