అజిత్ కి లారెన్స్ గిప్ట్..

Update: 2015-09-26 12:24 GMT
విభిన్న నటుడు అజిత్ లేటెస్ట్ మూవీ టైటిల్ వేదాళం. ప్రకటించినప్పటి నుంచే.. సోషల్ నెట్ వర్కింగ్ లో వేదాళం ఓ ట్రెండ్ అయిపోయింది. పవర్ ఫుల్ టైటిల్ అనీ, అజిత్ కి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. ఫ్యాన్స్ అయితే.. పేరుతోనే పండగ చేసేసుకుంటున్నారు. రజినీ కాంత్ కబాలి కారణంగా ఓ వారం లేట్ అయినా.. టైటిల్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో.. వేదాళం యూనిట్ హ్యాపీగా ఉంది.

అయితే.. ఈ టైటిల్ కి సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీ తెలిసింది. వేదాళం టైటిల్ ని అజిత్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట రాఘవ లారెన్స్. నిజానికి వేదాళం అంటే భూతం అని అర్ధం. హారర్ సినిమాలను పర్ ఫెక్ట్ తీసే లారెన్స్.. ఈ టైటిల్ ని గతంలోనే రిజిస్టర్ చేయించాడట. అయితే.. తమ మూవీకి ఇదే సరైన పేరు కావడంతో.. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం లారెన్స్ ని సంప్రదించారు. టైటిల్ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా.. ఓకే అనేశాడట డైరెక్టర్ లారెన్స్. ఓ స్టార్ హీరోకి సంబంధించిన చిత్రానికి ఇంత హంబుల్ గా బిహేవ్ చేయడం లారెన్స్ కే చెల్లిందంటూ ప్రశంశలు వినిపిస్తున్నాయి.

నిజానికి టైటిల్స్ విషయంలో కోర్టుకెక్కిన సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. ముందు వెనక తోకలు తగిలించాల్సిన అవసరం రాకుండా.. లారెన్స్ టైటిల్ ఇచ్చేయడంతో.. అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు లారెన్స్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. టాలీవుడ్ లో అయితే.. ఇవి ఇంకా ఎక్కువ. దీంతో ఆయా టైటిల్స్  పై మమకారం చంపుకోలేక.. హీరో పేరు తగిలించేస్తున్నాటారు. కళ్యాణ్ రామ్ కత్తి - మహేష్ ఖలేజాలు అలాంటివే.
Tags:    

Similar News