ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇంత‌గా విర‌హాగ్ని

Update: 2021-08-02 04:25 GMT
సోషల్ మీడియాల పుణ్య‌మా అని మ‌ర్చిపోతున్న హీరోయిన్ల‌ను కూడా తిరిగి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నారా రోహిత్ స‌ర‌స‌న `బాణం` చిత్రంలో న‌టించిన‌ వేదిక‌ ఆ త‌ర్వాత న‌ట‌సింహా బాల‌కృష్ణ‌ స‌ర‌స‌న `రూల‌ర్`లో అవ‌కాశం అందుకుంది. అయితే ఈ అందాల ఆడ‌బొమ్మ‌కు విజ‌యం క‌రువైంది. ఆ త‌ర్వాత వేదిక టాలీవుడ్ ని వ‌దిలి ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌య‌త్నించింది.

అందానికి అందం న‌ట ప్ర‌తిభ ఉన్నా కానీ త‌న‌ని ఎందుక‌నో అదృష్టం వ‌రించిన‌ట్టు లేదు. ఇక ఇటీవ‌లి కాలంలో వేదిక కూడా ఇత‌ర నాయిక‌ల్లానే హాట్ కంటెంట్ తో సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డుతోంది. త‌న లేటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సునామీని సృష్టిస్తున్నాయి.

తాజాగా వేదిక పూల్ సైడ్ ట్రీట్ యువ‌త‌రంలో అగ్గి రాజేస్తోంది. ఈ బ్యూటీ పూల్ సైడ్ ఛైర్ లో విర‌హంగా స‌రికొత్త‌ విన్యాసాల‌కు తెర తీయ‌డం నిజంగా బిగ్ స‌ర్ ప్రైజ్. మునుప‌టితో పోలిస్తే వేదిక‌లో హాట్ కంటెంట్ ఎలివేష‌న్ తో సెగ‌లు రేపుతోంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వేదిక అవ‌కాశాల కోసం త‌న‌లోని గ్లామ‌ర్ యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. అందాల ఆర‌బోత‌కు గేట్లు తెరిచేయ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఫీల‌ర్స్ వ‌ద‌ల‌డ‌మే ఇది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

త‌మిళం హిందీ ఆఫ‌ర్లు క‌లిసి రాలేదు!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి అట్నుంచి హిందీ చిత్ర‌సీమ‌కు వెళ్లినా వేదిక‌కు ఎందుక‌నో క‌లిసి రాలేదు. `ముని`లో రాఘ‌వ‌ లారెన్స్ స‌ర‌స‌న ఆడిపాడింది. కానీ అది కూడా క‌లిసిరాలేదు. వేదిక‌ 2019లో ది `బాడీ` అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లో న‌టించింది. ఇందులో హిమేష్ రేష‌మ్మియా.. రిషీ క‌పూర్.. శోభిత‌ ధూళిపాల‌ త‌దిత‌రులు న‌టించారు. వెబ్ సిరీస్ ల వెల్ల‌వ‌లో ఇటీవ‌ల రూట్ మార్చింది. మునుప‌టితో పోలిస్తే వేదిక‌లో హాట్ కంటెంట్ హీట్ పెంచుతోంది. ఇన్ స్టాలో వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇంత‌గా విర‌హంతో వీగిపోతున్న వేదిక‌కు ఛాన్సిస్తారా లేదా చూడాలి.
Tags:    

Similar News