'వీర సింహా రెడ్డి'కి వీరయ్య దెబ్బ

Update: 2023-01-17 02:30 GMT
తెలుగువారు ఎంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతికి ఈసారి మూడు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమాలు విడుదలయ్యాయి. అయితే కళ్యాణం కమనీయం అనే సినిమాకి మంచి టాక్ లేకపోవడంతో ప్రేక్షకులు దానిపై ఆసక్తి చూపడం లేదు. అయితే ముందు రోజు వీర సింహారెడ్డి సినిమా విడుదలవగా తర్వాత ఒకరోజు గ్యాప్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైంది.

నందమూరి బాలకృష్ణ సినిమాకి అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రవితేజ కూడా ఉండడంతో సినిమాకి అదనపు ఆకర్షణ యాడ్ అయినట్లు అయింది. దీంతో సంక్రాంతి రేసులో వీరసింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్య సినిమానే ముందు ఉంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే.... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా మాత్రం కేవలం మూడే రోజుల్లో 108 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంక్రాంతి మొనగాడిగా నిలిచినట్లయింది.

దీంతో కొన్నిచోట్ల కళ్యాణం కమనీయం సినిమాని తీసేసి మరి మా సినిమా వేయాలంటూ మెగా ఫ్యాన్స్ గొడవలకు దిగుతున్నారు. అదేవిధంగా వారసుడు వంటి సినిమాలకు టికెట్లు బుక్ అవడం లేదు... కాబట్టి మెగాస్టార్ సినిమా వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆయా సినిమా థియేటర్లతో పాటు తక్కువ బుకింగ్స్ నమోదు అవుతున్న బాలకృష్ణ సినిమా థియేటర్లను కూడా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా కోసం కేటాయించే అవకాశం ఉంది.

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా ముందంజలో ఉంది, ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ పరంగా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News