సిల్క్ స్మితపై మరో సెన్సేషనల్ మూవీ

Update: 2015-08-23 15:38 GMT
సిల్క్ స్మిత జీవితం నేపథ్యంలో తీసిన ‘డర్టీ పిక్చర్’ అంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. ఓ దక్షిణాది వ్యాంప్ నటి గురించి బాలీవుడ్డోళ్లు సినిమా తీస్తారని.. అది అంతగా హిందీ ప్రేక్షకులకు కనెక్టవుతుందని కూడా అనుకోలేదు. ఎప్పుడూ బాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. ‘డర్టీ పిక్చర్’ సినిమాతో అక్కడి ప్రేక్షకులకు సిల్క్ అంటే ఏంటో తెలిసొచ్చింది. డర్టీ పిక్చర్ తెచ్చిన క్రేజ్ తో ఇప్పుడు సిల్క్ జీవిత కథపై మరో సినిమా తెరకెక్కబోతోంది. మళ్లీ సిల్క్ గురించి సినిమా తీస్తే ఇంకెవరు చూస్తారు అని సందేహించాల్సిన పని లేదు. ఈసారి తీయబోయే సినిమా మరింత సంచలనం రేపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి కారణం.. ఆ  సినిమా తీయబోయే దర్శకుడే.

సిల్క్ స్మితకు సీనియర్ దర్శకుడు వేలు ప్రభాకరన్ తో అఫైర్ ఉండేదని అప్పటి సినిమాల్ని ఫాలో అయ్యేవారికి బాగానే తెలుసు. వేలును అందరూ సిల్క్ రహస్య ప్రేమికుడు అనేవారు. ఆ వేలు ఇప్పుడు సిల్క్ స్మిత జీవితం మీద సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. సిల్క్ తో ఎఫైర్ నడిపిన వాడు కాబట్టి ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తికర, సంచలన విషయాలు ఆయనకు తెలిసుండే అవకాశముంది. వాటన్నింటినీ తెరమీదికి తెస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం ఖాయం. సిల్క్ తో తన ప్రేమానుభవాలతో పాటు వేరే హీరోయిన్లకు సంబంధించిన గుట్టు మట్లను కూడా ఆయనీ సినిమాలో చూపించబోతున్నారట. సిల్క్ మరణానికి దారితీసిన వాస్తవ పరిస్థితుల్ని కూడా ఈ సినిమాలో రివీల్ చేస్తాడట. ఈ సినిమాకు సంగీతాన్నందించాలని ప్రఖ్యాత దర్శకుడు ఇళయరాజాను వేలు సంప్రదించడం విశేషం.
Tags:    

Similar News