క్యామియో అంటే ఇలా ఉండాలి

Update: 2016-10-08 09:55 GMT
ఈ మధ్య తెలుగులో రీమేక్ సినిమాలకు అస్సలు కలిసి రావట్లేదు. ముందే కథేంటన్నది జనాలకు తెలిసిపోతుండటం.. చాలామంది వేరే భాషలోనే ఆ సినిమాను చూసేస్తుండటంతో అంత క్యూరియాసిటీ ఉండట్లేదు. ఇలాంటి తరుణంలో ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్ ను తెలుగులోకి రీమేక్ చేస్తుంటే చాలామంది దాని గురించి నెగెటివ్ గానే మాట్లాడారు. సోషల్ మీడియాలో అదే పనిగా కొందరు ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ‘ప్రేమమ్’ ఈ నెగెటివ్ ప్రచారాన్ని తట్టుకుంది. సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు చందూ మొండేటి పనితనం.. నటీనటుల చక్కటి అభినయం.. సాంకేతిక నిపుణుల పనితీరు అన్నీ సమపాళ్లలో కలవడంతో ‘ప్రేమమ్’ ప్రేక్షకులకు చక్కటి అనుభూతినిస్తోంది.

ఈ సినిమా కోసం జోడించిన అదనపు ఆకర్షణలు కూడా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగార్జునల క్యామియోలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. సినిమాలో హీరో అల్లరిని భరించలేక ప్రిన్సిపాల్ అతడికి వార్నింగ్ ఇవ్వడానికి పేరెంట్స్ ను తీసుకురమ్మంటాడు. ఐతే అతను తన మావయ్యను తీసుకొస్తాడు. ఆ పాత్రలో వెంకీ.. డీసీపీ రామచంద్రగా ఎంట్రీ ఇస్తాడు. ‘బాబు బంగారం’ గెటప్ లో.. ‘ఘర్షణ’ థీమ్ మ్యూజిక్ వినిపిస్తుండగా ఎంట్రీ ఇస్తాడు వెంకీ. ఆయన కనిపించే నాలుగైదు నిమిషాలు రెస్పాన్స్ మామూలుగా ఉండదు. వెంకీ క్యామియోను భలే సరదాగా తీర్చిదిద్దారు. ఈ సీన్ మలయాళంలో కంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇక చివర్లో నాగార్జున వచ్చి తనదైన శైలిలో కొసమెరుపు లాంటి ముగింపునిచ్చాడు సినిమాకు. ఆ సీన్లో చైతూ-నాగ్ ట్రెండు గురించి మాట్లాడుకోవడం.. హీరోయిన్ ‘‘ట్రెండు గురించి ఆయనకు చెబుతావా’’ అనడం భలేగా ఉంటుంది. మొత్తంగా వెంకీ.. నాగ్.. ఇద్దరి క్యామియోలూ బాగున్నాయి. క్యామియో రోల్స్ ఎలా ఉండాలో చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News