ప్రేక్షకులు మారారని కొందరు దర్శకులు కూడా వారి మేకింగ్ స్టైల్ ని చాలా వరకు మార్చుకుంటున్నారు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి ధిగ్గట్టుగా కథలు రాసుకుంటూనే వారి తరహా ఆలోచనను కూడా కొత్తగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకర్షించడానికి టైటిల్స్ విషయంలో అలాగే హీరో క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు దర్శకుడు తేజా కూడా ఆ ఫార్ములాను కరెక్ట్ గా పట్టేశాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమైన తేజ కొన్ని నెలల క్రితం నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు ఇంతకుముందు చిత్రం అనే టైటిల్ సక్సెస్ అవ్వగానే.. జయం.. నిజం.. ధైర్యం.. లాంటి టైటిల్స్ తో ఎక్కువగా కనిపించాడు. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో వెంకటేష్ తో తీయబోయే సినిమాకి కూడా NRNM కి తగ్గట్టు పెట్టనున్నాడు.
‘‘ఆటా నాదే.. వేటా నాదే‘‘ అనే టైటిల్ ను వెంకీ సినిమాకు ఫైనల్ చేశాడట ఈ సీనియర్ దర్శకుడు. టైటిల్ ని చూస్తుంటే.. హీరోకి కొంచెం మళ్లీ నెగిటివ్ షేడ్స్ ఉండే విధంగా తెరకెక్కిస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది. మరి తేజ ఈ టైటిల్ సెంటిమెంట్ ని బాగానే వాడుతున్నాడు గాని సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. డిసెంబర్ 13న ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.