పిక్ టాక్ : వెంకీ మామ టీ పార్టీ

Update: 2021-11-08 05:26 GMT
వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఎఫ్‌ 3. ఇది ఎఫ్‌ 2 కు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెల్సిందే. మూడేళ్ల క్రితం వచ్చిన ఎఫ్ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్‌ రాజు నిర్మించిన ఎఫ్ 2 కు ఇప్పుడు అదే దిల్ రాజు సీక్వెల్‌ నిర్మిస్తున్నాడు. ఎఫ్‌ 2 లో కనిపించి వారికి అదనంగా ఈ సినిమాలో సునీల్‌ తో పాటు మరి కొందరు కూడా కనిపించబోతున్నారు. ఎఫ్ 3 సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యి ఆగస్టులోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ తో ఆలస్యం అయ్యింది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న ఎఫ్‌ 3 ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా షూటింగ్‌ గ్యాప్ లో పక్కనే ఉన్న వెంకటేష్ ఇంటికి వెళ్లారట. అక్కడ వెంకటేష్‌ టీ పార్టీ ఇచ్చినట్లుగా అనీల్‌ రావిపూడి పేర్కొన్నాడు. వెంకటేష్ ఇంట్లో టీ పార్టీ జరిగిందని అనీల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. వెంకీ మామ ఇంట టీ పార్టీకి దర్శకుడు అనీల్ రావిపూడితో పాటు ఇంకా వరుణ్ తేజ్‌.. తమన్నా.. సునీల్‌.. రాజేంద్ర ప్రసాద్‌.. రవిబాబులు కూడా ఉన్నారు. షూటింగ్‌ పక్కనే జరుగుతున్న కారణంగా వెంకీ మామ ఇంట్లో ఈ టీ పార్టీ జరిగినట్లుగా తెలుస్తోంది.

షూటింగ్‌ మొదలు పెట్టినప్పటి నుండి చాలా సరదాగా జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఫొటోలు షేర్‌ చేస్తూనే ఉన్నారు. సినిమా ఎంత సరదాగా ఉంటుందో షూటింగ్ అంతే సరదాగా సాగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చిత్రీకరణ కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు నిర్వహించడం లేదు.. భారీ మాస్ డైలాగ్స్ తో సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోవడం లేదు. సింపుల్‌ గా సినిమా మొత్తం సరదాగా సాగుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎఫ్ 3 సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News