వెంకీ సినిమా.. వాయిదా ఎందుకు?

Update: 2017-01-16 10:29 GMT
ఒక టైంలో విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్లే నవంబరు నెలాఖరుకే సినిమాకు గుమ్మడికాయ కూడా కొట్టేయడం.. పోస్ట్ ప్రొడక్షన్ మొదులపెట్టేయడం గుర్తుండే ఉంటుంది. కానీ సంక్రాంతికి పోటీ మరీ ఎక్కువగా ఉందని భావించి జనవరి 26కు సినిమాను వాయిదా వేశారు. రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు కూడా. కానీ ఏమైందో ఏమో.. ఈ సినిమా ఆ తేదీకి రావట్లేదు. వాయిదా వేస్తే వారం రెండు వారాలు వేయొచ్చు కానీ.. ఏకంగా రెండు నెలలకు పైగా పోస్ట్ పోన్ చేయడమేంటో అర్థం కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం ‘గురు’ను ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తారట.

షూటింగ్ మొత్తం పూర్తయ్యాక మూణ్నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికి ‘గురు’ ఏమీ గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ తో ముడిపడ్డ సినిమా ఏమీ కాదు. మామూలు చిత్రమే. పైగా రీమేక్. మహా అయితే నెల రోజుల్లో పని మొత్తం పూర్తయిపోతుంది. అయినా సినిమాను అంత ఆలస్యంగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. మంచి టైమింగ్ కోసమని అంత కాలం ఎదురు చూస్తున్నారా లేక రీషూట్లు ఏమైనా జరుగుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ముందు ఒరిజినల్లోని ఓ 15 నిమిషాల ఫుటేజిని తెలుగు వెర్షన్ కు కూడా తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. అవి ఇందులో సింక్ కాకపోవడంతో ప్రత్యేకంగా తెలుగు కోసం సన్నివేశాలు తీస్తున్నట్లుగా ఒక వెర్షన్ వినిపిస్తోంది. ఏదేమైనా మొన్న రిలీజైన ‘గురు’ టీజర్ చూశాక.. రిలీజ్ కోసం వెంకీ అభిమానులు ఏప్రిల్ దాకా ఆగాలంటే కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News