విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. గత కొంత కాలంగా తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ లో నటించేందుకు వెంకీ ప్రిపరేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ స్క్రిప్టుని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మన ఆడియెన్ అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారట. నేటివిటీకి తగ్గట్టు అవసరం మేర మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ స్క్రిప్టులో విక్టరీ వెంకటేష్ సలహాలు సూచనలు ఇస్తున్నారని అలా కుదరకపోతే తానే రైటర్ గా మారి జాగ్రత్త తీసుకుంటున్నారని రకరకాల పుకార్లు షికారు చేశాయి. అయితే అవేవీ నిజాలు కాదని తాజాగా తెలుస్తోంది. అసలు అసురన్ రీమేక్ స్క్రిప్టులో వెంకీ ప్రమేయం ఏదీ లేదట. అయితే తెలుగు వెర్షన్ స్క్రిప్టులో ఊహించని ట్విస్టులు ఉన్నాయని తాజాగా రివీలైంది.
అసురన్ తమిళ వెర్షన్ లో ధనుష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించారు. ఏజ్డ్ పర్సన్ గా.. యువకుడిగా రెండు పాత్రల్లో కనిపిస్తాడు. కానీ తెలుగు వెర్షన్ అందుకు పూర్తి విభిన్నంగా ఉండబోతోందట. అందులో ఓల్డ్ క్యారెక్టర్ లో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు కానీ యంగ్ క్యారెక్టర్ లో మాత్రం వేరొక యువహీరోకి అవకాశం ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే ఆ యంగ్ రోల్ కి ఎవరిని అనుకుంటున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే వెంకటేష్ కంటిన్యూగా మల్టీస్టారర్లు చేసినట్టే అవుతుంది. గోపాల గోపాల- ఎఫ్ 2 తరహాలోనే ఇది కూడా మల్టీస్టారర్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు.