టాలీవుడ్లో రీమేకులతో చాలా పెద్ద పెద్ద సక్సెస్ లు చూసిన హీరో విక్టరీ వెంకటేష్. గత కొన్నేళ్లలో తెలుగులో రీమేకుల సక్సెస్ రేట్ తగ్గినా సరే.. వెంకీ మాత్రం ఆ బాటను వదలట్లేదు. తరచుగా రీమేక్స్ చేస్తూనే ఉన్నాడు. వెంకీ కొత్త సినిమా ‘గురు’ కూడా రీమేకే అన్న సంగతి తెలిసిందే. తమిళ.. హిందీ భాషల్లో విజయవంతమైన ఇరుదు సుట్రు/సాలా ఖడూస్ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ అయిన తెలుగమ్మాయి సుధ కొంగరనే తెలుగులోకి రీమేక్ చేస్తోంది. ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేయడంతో మక్కీకి మక్కీ దించేశారని.. మాతృకతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ ఉండవని అంతా అనుకున్నారు. కానీ దీని టీజర్ చూస్తే మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చినప్పటికీ.. కథ ప్రధానంగా హీరో చుట్టూనే తిరగాలనే ఆశిస్తారు మనోళ్లు. ఇది దృష్టిలో ఉంచుకునే ‘గురు’ కథను కూడా వెంకీ చుట్టూనే తిప్పినట్లుగా కనిపిస్తోంది. మాతృకలో మాధవన్ కథలో ఒక పాత్రధారిలా కనిపిస్తాడు తప్ప అతనే లీడ్ అన్నట్లుగా ఏమీ చూపించరు. ఆ సినిమా ట్రైలర్ చూసినా ఆ సంగతి అర్థమవుతుంది. కానీ ‘గురు’ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన రెండు టీజర్లూ చూస్తే ఇందులో వెంకీని బాగా హైలైట్ చేసే ప్రయత్నం జరిగిందని.. రితిక పాత్రను కొంచెం తగ్గించారని అర్థమవుతోంది. ఒరిజినల్లో గురుశిష్యుల కథలాగా డీల్ చేసిన సుధ.. తెలుగులోకి వచ్చేసరికి ‘గురు’వు కథగా మార్చినట్లు తెలుస్తోంది. ఐతే ఈ మార్పులు ఏమేరకు జరిగాయో ఏమో కానీ.. ‘గురు’ లేటెస్ట్ టీజర్ అయితే అదుర్స్ అనిపించింది. సినిమాపై అంచనాలు బాగా పెంచేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/