నీర‌జా వెంక‌టేష్.. ఏ రేర్ ఫొటో!

Update: 2017-01-30 09:46 GMT
జీవీకేగా సుప‌రిచితులైన పారిశ్రామిక దిగ్గ‌జం జీవీ కృష్ణారెడ్డి మ‌న‌వ‌డు కేశ‌వ్‌ వివాహ వేడుక‌లోని అరుదైన ఫొటో ఇది! వెంక‌టేష్ ప‌క్క‌నున్న‌ది ఆయ‌న భార్య నీర‌జ. ఆదివారం జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు వ‌చ్చిన అతిథులంతా ఈ జంట‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. అందుకు కార‌ణం లేక‌పోలేదు!

సినీ ప‌రిశ్ర‌మ‌లో కుటుంబానికి సంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట‌కు తెలియ‌నివ్వ‌కుండా, త‌న భార్యా పిల్ల‌ల‌కు సెలెబ్రిటీ స్టేట‌స్‌ తో ఇబ్బందులు రాకుండా చూసుకునే అతికొద్దిమందిలో న‌టుడు వెంక‌టేష్ ఒక‌రు. వ్య‌క్తిగ‌త జీవితానికీ, వృత్తిగ‌త జీవితానికీ ముడిపెట్ట‌రాయ‌న‌. ఆయ‌న భార్య‌ - పిల్ల‌ల‌ను... అత్యంత స‌న్నిహితులైన వారి ఇంట్లో జ‌రిగే శుభ‌కార్యాల‌కే తీసుకెళ్తుంటారు. అందుకే, వాళ్ల ఫొటోలు మీడియాలో క‌నిపించ‌డం కూడా చాలా అరుదు. అలాంటి జంట ఒక్క‌సారిగా క‌నిపించేస‌రికి అంద‌రూ వీరి గురించే మాట్లాడుకున్నార‌ట‌. ఎప్పుడూ క‌నిపించ‌ని నీర‌జ చాలా సింపుల్‌ గా - వెంకీ కూడా చాలా క్యాజువ‌ల్ డ్రెస్‌ లో క‌నిపించేస‌రికి అంద‌రూ ఈ జంట‌నే చూస్తూ ఉండిపోయార‌ట‌. అలా ఈ జంట ఈ వేడుక‌లో వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ గా నిలిచార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News