అఖిల్ హీరోగా నటించిన మూడో సినిమా `మిస్టర్ మజ్ను` రిపోర్ట్ ఏంటి? అంటే .. బాక్సాఫీస్ వసూళ్లలో అంతంత మాత్రమేనన్న ముచ్చట సాగుతోంది. ఈ సినిమాపై సమీక్షలు పెదవి విరిచేశారు. ప్రథమార్థం బావున్నా, ద్వితీయార్థంలో తప్పులు జరిగాయని విశ్లేషించారు. కారణం ఏదైనా.. రెండ్రోజుల్లో ఈ సినిమా కేవలం 5.6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దాదాపు 24 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ వారం అంతా దూకుడుగా వసూలు చేస్తేనే కొంతవరకూ రికవరీ సాధ్యమవుతుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
అయితే ఈ సినిమా రిజల్ట్ పై దర్శకుడి వెర్షన్ వేరొకలా ఉంది. సినిమా విజయంపై తనకు మాత్రం ధీమా ఉందని `మిస్టర్ మజ్ను` దర్శకుడు వెంకీ అట్లూరి అంటున్నారు. ఆడియెన్ నుంచి మౌత్ టాక్ బావుంది. సమీక్షల్లో కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవం. కొన్ని సన్నివేశాల్లో తప్పు జరిగిందని విశ్లేషించారు. కామెడీ అంతంత మాత్రమే అని అన్నారు. అయితే థియేటర్లలో ఆడియెన్ నుంచి కామెడీ సన్నివేశాలకు చక్కని స్పందన వస్తోంది.. అని వెంకీ అన్నారు. తొలి ప్రేమ టైమ్ లో ఎంతో బావుందని ప్రశంసించిన సమీక్షకులు ఈసారి విమర్శించారు. అందుకే విమర్శకులపై నాకు కోపం రాదు.. సమీక్షల్ని పాజిటివ్ గానే స్వీకరిస్తాను.. అని వెంకీ అట్లూరి అన్నారు.
మీరు ద్వితీయ విఘ్నం (దర్శకులకు రెండో సినిమా ఇబ్బంది) అధిగమించారా? అన్న ప్రశ్నకు తాను కూడా ఆ సెంటిమెంట్ ఫీలయ్యానని, అయితే ఈ సినిమా రిలీజ్ ముందే సినిమా చూసిన తొలి ఆడియెన్ గా నాగార్జున తనకు భరోసానిచ్చారని వెంకీ అట్లూరి అన్నారు. కథ విన్న తర్వాత చివరిలోనే కింగ్ నాగార్జునకు సినిమా చూపించారట. ఒకే ఒక్క సీన్ ని కరెక్ట్ చేయమని ఆయన సూచించారు. ఆ పని చేశాకే రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో జరిగిన ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి ఈ విషయాల్ని వెల్లడించారు. ఇక తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. మైత్రికి కమిట్ మెంట్ ఉంది.. ఇంకా మాట్లాడాలి. దిల్ రాజు గారు శ్రేయోభిలాషి .. ఆయన బ్యానర్ లోనూ ఛాన్స్ ఉన్నా దాని గురించి ఇప్పుడే మాట్లాడలేను అని అన్నారు. `మిస్టర్ మజ్ను` రిలీజ్ తర్వాత ఇంకా మైత్రి సంస్థను కలవలేదు. పదిరోజులైనా అవ్వాలి. అయ్యాక ఈ సినిమా ప్రమోషన్ పూర్తయ్యేకే మైత్రితో చర్చలు ఉంటాయి.. అని వెంకీ అన్నారు. యువహీరోలు నాగ చైతన్య, దేవరకొండ, శర్వా .. వీళ్లతో సినిమాలుంటాయా? అన్న ప్రశ్నకు ఉంటే బావుంటుంది. వాళ్లంతా నా స్నేహితులే అని వెంకీ అన్నారు. మైత్రి సంస్థలో దేవరకొండతో వెంకీ అట్లూరి సినిమా ఉంటుందని ఇదివరకూ వార్తలొచ్చాయి. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉందని వెంకీ అన్నారు.