ప్రస్తుతం ప్రయోగాత్మకమైన చిత్రాలతో చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో లో అడుగుపెట్టి సక్సెస్ కొట్టేస్తున్నారు. కమర్షియల్ హంగులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సినిమా చేస్తే ప్రతి ఒక్కరినీ ఆకర్షించాలని ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు రావాలని కొత్త దర్శకులు వెరైటీ కథలతో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఫుల్ కమర్షియల్ దర్శకులు కూడా సక్సెస్ కొడుతున్నారు. సినిమాలో కామెడీ లవ్ యాక్షన్ అంశాలను జోడిస్తూ భారీ హిట్ అందుకుంటున్నారు.
ఇటీవల ఆ తరహాలో హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. ఛలో సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. హీరో నాగ శౌర్య కెరీర్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే అప్పటి నుంచి దర్శకుడు వెంకీకి చాలా మంది నిర్మాతల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా వెంకీ గీతా ఆర్ట్స్ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ తో వెంకీ చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్.
కథ కూడా దాదాపు సెట్ అయ్యిందట. నిర్మాత హీరో డిస్కర్షన్స్ లో ఉన్నట్లు సమాచారం. ఒక రోజు కూర్చొని సినిమా గురించి పూర్తిగా చర్చలు జరిపి బడ్జెట్ లాక్ చేయనున్నారట. ఒకసారి ఫిక్స్ చేస్తే అల్లు అరవింద్ ఆగరని అందరికి తెలిసిందే. ఇక అదే తరహాలో ఈ కాంబో స్పీడ్ అందుకుంటుందని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఆ న్యూస్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కరుణాకరన్ - తేజ్ ఐ లవ్ యూ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.