మామ‌- అల్లుళ్లు ఉగాది స్పెష‌ల్‌

Update: 2019-04-06 03:33 GMT
ప్రకృతి పార‌వ‌శ్యం మైమ‌రిపించాల‌న్నా.. పిల్ల‌గాలి గుండెల్లో ఆహ్ల‌దాన్ని నింపాలన్నా.. కోయిలమ్మ కుహూగానం చెవిలో జోల‌పాడాల‌న్నా.. రసాలూరే మామిళ్లు నోరూరించాలన్నా... మల్లెలు పరిమళాల మత్తు చల్లాలన్నా... వసంతుని రాక అవ‌స‌రం. అలాంటి వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగు లోగిళ్లు జరుపుకునే పండగే ఉగాది. వికారి నామ సంవత్సరంగా మన ముందుకు వచ్చింది. ప‌చ్చ‌ని ప‌ల్లెలు భార‌తావ‌నికి ప‌ట్టుగొమ్మ‌లు అని నిర్వ‌చించిన క‌వి సాక్షిగా... ప‌చ్చ‌ని పొలంలో పైర‌గాలి వీస్తుండ‌గా .. వెంకీ (ఎంకి) మామ ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడ‌ని అనుకోలేదు. మామా అల్లుళ్లు అదిరిపోయే లుక్కిచ్చారు.

ప‌చ్చ‌ని వ‌రిపొలం .. ఆ గ‌ట్టుపైన ధాన్యం మూట‌లు.. వాటి చెంత‌ చెట్టునే మ‌గ్గిన అర‌టి గెల‌లు .. కొబ్బ‌రి చెట్టు సందులోంచి చూస్తే అల్లంత దూరాన క‌నిపిస్తున్న ఆ దేవాల‌యం.. ఆ ధాన్యం మూట‌ల‌పై కూచుని ఆ ఫోజిచ్చిన తీరు చూస్తుంటే మైమ‌రిచిపోవాల్సిందే. ఇంత‌కీ ఆ ప‌ల్లెలో ఈ మామా అల్లుళ్ల పోర్ష‌న్స్ ఏంటో కానీ - ద‌ర్శ‌కుడు బాబి ఎలా డిజైన్ చేశారో కానీ క‌చ్ఛితంగా ఇది సంక్రాంతి పండ‌గ‌ను చాలా ముందే తెచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ కాన్సెప్టు అదుర్స్. ఉగాది రోజు వేకువ ఝామున సాములోరి దివ్య ద‌ర్శ‌నం అయిన‌ట్టే ఉంది మ‌రి. కార్పొరెట్ క‌ల్చ‌ర్ తో ముఖం వాచిన వారికి ప‌ల్లె ప‌ట్టు పండ‌గ‌ను తెచ్చిన‌ట్టు.. వేకువ‌ఝామునే ఉగాది ప‌చ్చ‌డి తినిపించినట్టు ఉందీ పోస్ట‌ర్.

మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడికి అంకిత‌మిస్తూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. గోదావ‌రి ప‌రిస‌రాల్లో మెజారిటీ చిత్రీక‌ర‌ణ చేశారు. నిన్న‌టిరోజున రిలీజ్ చేసిన వెంకీ మామ థీమ్ పోస్ట‌ర్ క్యూరియాసిటీ పెంచింది. ప‌ల్లె వాతావ‌ర‌ణం ఓవైపు.. యుద్ధ వాతావ‌ర‌ణం ఇంకోవైపు .. ఉత్కంఠ పెంచాయి.  యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య - విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ లో ఈ మూవీ మ‌రో లాఫింగ్ ర‌య‌ట్ అంటూ ఇప్ప‌టికే అర్థ‌మ‌వుతోంది. పాయ‌ల్ రాజ్ పుత్, రాశీ ఖ‌న్నా ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఎస్.ఎస్.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మామా అల్లుళ్లు ఉగాది సంబ‌రం తెచ్చారు స‌రే.. ఆ ఇద్ద‌రి మ్యాజిక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మేర‌కు వ‌ర్క‌వుట‌వుతుంది? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News