వెంకీ ఆ డైలాగ్ కు భ‌లే ఒప్పుకున్నాడే..

Update: 2016-06-08 15:29 GMT
‘‘ఫ‌స్ట్ టైం చూస్తున్నానురా ఇలాంట‌మ్మాయిని. మ‌న‌సుకు మ‌న‌సు జాలికి జాలి’’.. అని వెంక‌టేష్ అంటుంటే.. ఠ‌పీమ‌ని ‘‘ఏజ్ కు ఏజ్’’ అంటూ పంచ్ వేసేశాడు వెన్నెల కిషోర్. ‘బాబు బంగారం’ టీజ‌ర్ చూసిన వాళ్లంద‌రూ ఒక్క క్ష‌ణం అవాక్క‌య్యే ఉంటారు ఈ డైలాగ్ చూసి. వెంక‌టేష్ లాంటి ఇమేజ్ ఉన్న‌ స్టార్ హీరో ఇలా త‌న మీద సెటైర్ వేయించుకోవ‌డానికి ఒప్పుకోవ‌డం విశేష‌మే. సినిమాలో ఏ సంద‌ర్భంలో ఈ డైలాగ్ వ‌స్తుందో కానీ.. టీజ‌ర్లో చూసిన‌పుడు మాత్రం జ‌నాల‌కు ఇంకో ర‌క‌మైన ఫీలింగ్ క‌లిగింది.

ఒక‌ప్పుడైతే స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి డైలాగులు పూర్తిగా నిషిద్ధం. అభిమానులు హ‌ర్ట‌వ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా ఉండేవాళ్లు. హీరో అంటే చాలా హుందాగా ఉండాలి. ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు. ఒక మాట ప‌డ‌కూడ‌దు. ఒక దెబ్బ తిన‌కూడ‌దు. హీరో పంచ్ వేయాలి త‌ప్ప హీరో మీద ఎవ‌రూ పంచ్ వేయ‌డానికి వీల్లేదు. కానీ గ‌త కొంత కాలంగా ఈ ప‌రిస్థితి మారుతూ వ‌స్తోంది.

ఎంతైనా ఇలాంటి విష‌యాల్లో వెంకీ ముందు నుంచి కొంచెం ప‌ట్టువిడుపు మ‌నిషేలెండి. క్యారెక్ట‌ర్ల విష‌యంలో ఇమేజ్ గురించి పెద్ద‌గా ఆలోచించ‌డు. అలా ఆలోచించేవాడే అయితే.. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు’ సినిమాలో త‌న పాత్ర త‌క్కువైనా.. మ‌హేష్ త‌న‌ను అంత డామినేట్ చేసినా ఎలా ఒప్పుకునేవాడు? ఇలా బ్రాడ్ గా ఆలోచించిన‌పుడే మంచి పాత్ర‌లు వ‌స్తాయి. సినిమాల్లో వైవిధ్యం క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కులు కొత్త‌గా ఆలోచించ‌డానికి అవ‌కాశం ద‌క్కుతుంది.
Tags:    

Similar News