పవన్‌ మామిడి కాయలు.. వేణు మాధవ్‌ బియ్యం

Update: 2019-09-27 05:57 GMT
ప్రముఖ తెలుగు కమెడియన్‌ వేణు మాధవ్‌ మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అంటూ సినీ ప్రముఖులు పలువురు సంతాపం తెలియజేశారు. మహేష్‌ బాబు.. చిరంజీవి సహా పలువురు స్టార్‌ హీరోలు.. హీరోయిన్స్‌.. దర్శక నిర్మాతలు ఆయనతో వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరు ఆయన మంచితనం గురించి మాట్లాడి ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మరియు వేణు మాధవ్‌ మద్య కొంత కాలం క్రితం జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

వేణు మాధవ్‌ కమెడియన్‌ గా మంచి ఫామ్‌ లో ఉన్న సమయంలో తన స్వస్థలం కోదాడ పరిసర ప్రాంతాల్లో 10 ఎకరాల పొలం కొనుగోలు చేశాడట. ఆ పొలంను తన వారితో చేయించేవాడు. ప్రతి ఏడాది ఆ పొలంలో పండిన వడ్లను బియ్యం పట్టించి హైదరాబాద్‌ కు వేణు మాధవ్‌ తీసుకు వచ్చేవాడు. ఆ బియ్యం నుండి ఒక బస్తాను తప్పనిసరిగా పవన్‌ కళ్యాణ్‌ ఇంటికి పంపించేవాడట. నా పొలంలో పండిన పంట అంటూ వేణు మాధవ్‌ చెప్పడంతో పవన్‌ కళ్యాణ్‌ స్వీకరించేవాడు. అలా ఎన్నో ఏళ్లుగా ఆ పద్దతి కొనసాగుతూ వచ్చింది.

పవన్‌ కళ్యాణ్‌ ప్రతి ఏడాది తన మామిడి తోట నుండి కొందరు స్నేహితులు సన్నిహితులకు మామిడి పండ్లు పంపించేవాడు. అలా పవన్‌ కళ్యాణ్‌ మామిడి పండ్లను పొందిన వారిలో వేణు మాధవ్‌ కూడా ఉండేవాడు. పవన్‌ కళ్యాణ్‌ మామిడి కాయలు.. వేణు మాధవ్‌ బియ్యం ఇలా చాలా ఏళ్ల పాటు కొనసాగిందని ఇద్దరికి కామన్‌ గా తెలిసిన ఒక వ్యక్తి మీడియా ముందు చెప్పుకొచ్చాడు. అన్నవరం సినిమా షూటింగ్‌ సమయంలో వేణు మాధవ్‌ తో పవన్‌ కు సన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మద్య సరదా సంఘటనలు చాలా ఉంటాయని.. ఇద్దరు చాలా జోవియల్‌ గా మాట్లాడుకునే వారు అంటూ పవన్‌ కు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News