నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ''కర్ణన్''. అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే ఇందులో విలక్షణ నటుడు రావు రమేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
తమిళ ‘కర్ణన్’ సినిమాలో హీరోకి మార్గదర్శకుడిగా నిలిచే తాత పాత్రలో మలయాళ నటుడు లాల్ నటించారు. కథాపరంగా ఎల్లప్పుడూ హీరోతో పాటు ఉండే ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే తెలుగులో ఈ పాత్రను రావు రమేశ్ తో చేయించాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
విలక్షణ పాత్రలతో విభిన్నమైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రావు రమేష్. అన్ని రకాల పాత్రలను పండించే అతి కొద్దిమంది నటులలో ఒకరైన రావు గోపాల్ రావు తనయుడు.. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో 'కర్ణన్' తెలుగు రీమేక్ లో నటించేది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే 'కర్ణన్' చిత్రాన్ని తెలుగులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తారనే వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.