కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన.టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోల్లో ఒకరైన సత్యదేవ్.. ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు.
ఇటీవల కాలంలో అనేక మంది హీరోలు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటున్నారు. ఇప్పుడు సత్యదేవ్ 'SD కంపెనీ' అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టాడు. తాజాగా ఈ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
సత్యదేవ్ స్వీయ నిర్మాణంలో ''ఫుల్ బాటిల్'' అనే సినిమా తెరకెక్కుతోంది. శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఫుల్ బాటిల్' సినిమాలో 78.1 % వినోదం.. 21.9% యాక్షన్ ఉంటుందని సత్యదేవ్ పేర్కొన్నారు. ఈరోజు బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇదే క్రమంలో టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు.
ఒక ఆటోలో డ్రైవింగ్ సీట్ లో అబ్బాయి.. బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చొని ఉండగా.. ఆటో పైన ఒక మందు సీసాలో ''ఫుల్ బాటిల్'' టైటిల్ డిజైన్ చేయబడింది. అలానే బ్యాగ్రౌండ్ లో కాకినాడ పోర్టు.. ఓ గ్రామం.. ఓ గుడి.. వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో సత్యదేవ్ ఒక తాగుబోతుగా కనిపించనున్నాడు.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఇది వరకు సత్యదేవ్ తో 'తిమ్మరుసు' అనే సినిమా తెరకెక్కించాడు. అంతకు ముందు నిఖిల్ తో 'కిర్రాక్ పార్టీ' సినిమా చేసిన శరన్.. 'గాలివాన' అనే వెబ్ మూవీతో రాబోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సత్యదేవ్ తో ''ఫుల్ బాటిల్'' సినిమా రూపొందిస్తున్నాడు.
శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ లో రామాంజనేయులు జవ్వాజి తో కలిసి సత్యదేవ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సంతోష్ కామిరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరి 'ఫుల్ బాటిల్' సినిమాతో నిర్మాతగా మారుతున్న సత్యదేవ్.. తొలి ప్రయత్నంలో ఫుల్ ప్రాఫిట్స్ అందుకుంటారో లేదో చూడాలి.