విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ జంట వెడ్ లాక్ న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. డిసెంబర్ 9న ఈ జంట వివాహం మంది బంధుమిత్రులు పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో రాజాస్థాన్ లో నిరాడంబరంగా జరిగింది. తాజాగా వివాహానికి సంబంధించిన ఫోటోల్ని విక్కీ కౌశల్ ఇన్ స్టా వేదికగా అభిమానులకు షేర్ చేసాడు.
అంతే కాదు ప్రేక్షకాభిమానుల దీవెనెలు తమకెంతో అవసరం అని ఎంతో వినయంగా కోరుకున్నారు. ``ప్రేమ..కృతజ్ఞత మాత్రమే మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చాయి. మా ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు ఎంతో అవసరం`` అనిపోస్ట్ చేసాడు. దీంతో విక్కీ-క్యాట్ అభిమానులు..ఫాలోవర్స్ తమదైన శైలిలో నవదంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు.
బ్యూటీపుల్ కపుల్స్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కొత్త జీవితం..ప్రయాణం ఎంతో సంతోషంగా సాఫీగా నూరేళ్లు పాటు సాగిపోవాలి. పొరపొచ్చాలు సహజం. వాటిని అధిగమించి జీవితంలో ముందుకు వెళ్లిపోవాలని అభిమానులు కోరుకున్నారు. అలాగే లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ.. ఇంకా మరెన్నో ఆసక్తికర కామెంట్లతో కొత్త దంపతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ సమయంలో పెళ్లి పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా చేసుకోవడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విక్కీ-కత్రినా సినిమాల విషయానికి వస్తే ఇద్దరు బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. కత్రినా బాలీవుడ్ లో ఎప్పటి నుంచో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.
`యూరి` సినిమాతో విక్కీ కౌశల్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అప్పటికే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ `ఉరి` ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇటీవలే `సర్దార్ ఉద్ధమ్` తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం `గోవింద్ నామ్ మేరా`.. `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ` చిత్రాల్లో నటిస్తున్నాడు.