కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ గత సంవత్సరం డిసెంబర్ లో తమ వివాహానంతరం మొదటి కర్వా చౌత్ ను జరుపుకుంటున్నారు. బాలీవుడ్ లోని చాలా మంది జంటల మాదిరిగానే కత్రినా- విక్కీ కూడా వారి తల్లిదండ్రులతో పాటు సాంస్కృతిక ఆచారాలలో పాల్గొన్నారు. తాజాగా లవ్ బర్డ్స్ ఇద్దరూ తమ తమ సోషల్ మీడియాల్లో కర్వా చౌత్ వేడుకల నుంచి సంతోషకరమైన ఫోటోలను అభిమానులు అనుచరుల కోసం షేర్ చేసారు.
కర్వా చౌత్ వేడుక నుండి అందమైన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోకి రాగానే ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట ప్రత్యేక సందర్భం కోసం అద్భుతమైన సంప్రదాయ దుస్తులను ధరించారు. విక్కీ గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో కూడిన తెల్లటి కుర్తాను ధరించి వైట్ ప్యాంటుతో స్టైల్ గా కనిపంచాడు. మరోవైపు కత్రినా ప్రింటెడ్ బ్లౌజ్ తో అందమైన ఎరుపు రంగు చీరను ధరించి పూర్తిగా తేజోవంతంగా కనిపించింది.
కాంబినేషన్ గా ఎరుపు రంగు గాజులు- చెవిపోగులు మంగళసూత్రంతో అలంకరించి కనిపించింది. విక్కీ - కత్రినా ఒకరితో ఒకరు పోజులివ్వడమే కాకుండా తమ తల్లిదండ్రులతో కలిసి ఒక ఫోటోకి ఫోజులిచ్చారు. ఫోటోలను షేర్ చేస్తూ కత్రినా ఈ పోస్ట్ కి, ''పహలా #కర్వాచౌత్ (నక్షత్రాలతో కూడిన ఎమోజి)'' అని క్యాప్షన్ ఇచ్చింది.
కత్రినా -విక్కీ జంట గత సంవత్సరం డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు. పెళ్లి.. ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాల నుండి ఫోటోగ్రాఫ్స్ వీడియోలు సోషల్ మీడియాల్లో వరల్ అయ్యాయి. పెళ్లికి ముందు ఈ జంట తమ సంబంధం గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... విక్కీ- కత్రినా ఇద్దరూ ఆసక్తికరమైన లైనప్ ను కలిగి ఉన్నారు. విక్కీ ప్రస్తుతం గోవింద నామ్ మేరా చిత్రంలో కనిపించనున్నారు. సారా అలీ ఖాన్ తో లక్ష్మణ్ ఉటేకర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ నిర్ణయించలేదు. సామ్ బహదూర్ మూవీతో పాటు.. ఆనంద్ తివారీ తదుపరి చిత్రంలోను నటించనున్నారు.
మరోవైపు కత్రినా 'ఫోన్ భూత్' విడుదలకు సిద్ధమవుతోంది. మెర్రీ క్రిస్మస్- టైగర్ 3లోనూ నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 చేస్తుండగా.. ప్రియాంక చోప్రా - అలియా భట్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ జీ లే జరాలో నటించనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.