క్యాట్ హ‌బ్బీ హ్యాండిస్తే క‌పూర్ దిగాడు!

Update: 2022-11-20 00:30 GMT
బాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన యువ కెర‌టం విక్కీ కౌశ‌ల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస‌గా విజ‌యాలు అందుని ఏకంగా త‌క్కువ స‌మ‌యంలో క్రేజీ హీరోగా మారిపోయాడు. అటుపై స్టార్ హీరోయిన్ క‌త్రినాకైఫ్ ని ప్రేమించి పెళ్లాడి ఇంకా ఫేమ‌స్ య్యాడు. ఇవ‌న్నీఒకేసారి జ‌రిగిపోవ‌డంతో విక్కీ కౌశ‌ల్ స్టార్ హీరోల లీగ్ లో చేరిపోయాడు.

ట్యాలెంట్  తో పాటు ల‌క్ కూడా క‌లిసి రావ‌డంతో కౌశ‌ల్ కెరీర్ ఒక్క‌సారిగా టర్న్ తీసుకుంది. ప్ర‌స్తుతం మీడియం రేంజ్ హీరోల్లో విక్కీ రేంజ్ మాత్రం ప్ర‌త్యేక‌మైన‌దిగానే చెప్పాలి. ఎంత‌లా అంటే? ఓ  డైరెక్ట‌ర్ కి డేట్లు కేటాయించి మ‌రీ చివ‌రి నిమిషంలోహ్యాండ్ ఇచ్చేంత‌గా! అనొచ్చు. వివ‌రాల్లోకి వెళ్తే..

విక్కీ కౌశ‌ల్ ..అనీష్ బ‌జ్మీ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. హిట్లు లేని బాలీవుడ్కి 'భూల్ భుల‌య్యా-2 'తో ఓ విజ‌యం అందివ్వ‌డంతో అనీష్ పేరు మారు మ్రోగిపోయింది.  ఈక్ర‌మంలోనే  వీక్కి కౌశ‌ల్ తో సినిమా చేయాల‌ని ఆయ‌నో క‌థ వినిపించాడు. క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌నా ఒకే చేసాడు. అయితే అనూహ్యంగా ఇప్పుడా సినిమా చేయ‌లేన‌ని అనీష్  కి హ్యాండ్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు తాను ఉన్న స్థితితో ఆ సినిమా చేయ‌లేన‌ని అదే హీరో వేరే సినిమాకి డేట్లు కేటాయించాడుట‌.

దీంతో అనీష్ మ‌రో ఆలోచ‌న లేకుండా అత‌న్ని ఉన్న ప‌ళంగా విడిచిపెట్టి బ‌య‌ట‌కు వ‌చ్చేసాడుట‌. అదే కథ‌ని యంగ్ హీరో షాహిద్ క‌పూర్కి చెప్పి ఒప్పించాడుట‌. క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న వెంట‌నే ఒకే చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇదే విష‌యాన్ని అనీష్ మీడియా ముందు మ‌రోలా చెప్పాడ‌ని వినిపిస్తుంది. షాహిద్ తో వేరే క‌థ చేస్త‌న్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

కానీ అందులో వాస్త‌వం లేద‌ని... మీడియాలో వివాదాల‌కు తావు ఇవ్వ‌కుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అలా క‌వ‌ర‌ప్ చేస్తున్న్లట్లు బాలీవుడ్ మీడియాలో  వార్త‌లొస్తున్నాయి. ఈసినిమా వ‌చ్చే ఏడాది మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది. ఇక షాహిద్  'జెర్సీ' రీమేక్ తో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల  ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం 'బ్ల‌డీ డాడి' సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది త‌ప్ప‌కొత్త ప్రాజెక్ట్ ఏది చేతిలో లేదు . తాజా క‌మిట్ మెంట్ తో మ‌రో  సినిమా ఖాతాలో ప‌డింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News