వీడియో సాంగ్ : హాట్‌ హాట్ గా 'ఆల్‌ మోస్ట్‌ పడిపోయిందే పిల్లా'

Update: 2022-12-23 05:30 GMT
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దాస్ క దమ్కీ'. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ మరియు పాట సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.

ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదల అయిన ఆల్‌ మోస్ట్‌ పడిపోయిందే పిల్లా పాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ ను యూట్యూబ్‌ ద్వారా రాబట్టి చాలా రోజులు ట్రెండ్‌ అయిన ఈ పాట ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తూనే ఉంది.

ఆల్‌ మోస్ట్‌ పడిపోయిందే పిల్లా పాట సినిమా స్థాయిని అమాంతం పెంచడంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ  అంతా ఆసక్తిగా ఎదురు చూసే విధంగా చేసింది అనడంలో సందేహం లేదు. అలాంటి పాట ఇప్పుడు వీడియో సాంగ్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యూట్యూబ్‌ ద్వారా మరోసారి ఆల్‌ మోస్ట్‌ పడిపోయిందే పిల్లా పాట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది. వీడియో సాంగ్‌ లో హీరోయిన్ నివేధా పేతురాజ్ హాట్‌ హాట్‌ అందాలు చూపించడంతో పాటు విశ్వక్ సేన్ యొక్క డాన్స్ మరియు మ్యాన్లీ నెస్ తో అలరిస్తున్నాడు.

వీడియో సాంగ్‌ విడుదల అయిన తర్వాత దాస్ క దమ్కీ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమా కు విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అవ్వడంతో కచ్చితంగా డీసెంట్‌ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News