సాధారణ ఎన్నికలను తలపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ ముగిశాయి. హోరా హోరీ ప్రచారాలు.. ఒకరిపై మరొకరు విమర్శలు ఆరోపణలు దూషణలతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరిగాయనే చెప్పాలి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలుపొందారు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై వంద ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. అయితే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రకాశ్ రాజ్.. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ప్రాంతీయ వాదానికి ప్రాధాన్యత ఇచ్చి 'మా' ఎన్నికల్లో తెలుగు బిడ్డను గెలిపించారని.. ఇలాంటి అసోసియేషన్ లో తాను కొనసాగలేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని.. అతిథిగా వచ్చాచను కాబట్టే అతిథిగానే ఉంటానని అన్నారు. సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులు దర్శకనిర్మాతలతో కలిసుంటానని తెలిపారు. అయితే 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకోవడం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశిస్తూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే 'వకీల్ సాబ్' లోని ఓ సన్నివేశాన్ని జోడిస్తూ షేర్ చేస్తున్న ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'వకీల్ సాబ్' సినిమాలో పవన్ కళ్యాణ్ - ప్రకాశ్ రాజ్ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరి మధ్య పోటాపోటీగా వాదనలు ప్రతి వాదనలు జరుగుతాయి. చివరకు లాయర్ నందా కేసులో ఓడిపోయి పవన్ గెలుస్తారు. ఆ సందర్భంగా ఓటమి బాధలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు పవన్ ధైర్యం నూరిపోస్తారు.
''నందాజీ.. ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలిచే అవకాశం. ఆల్ ది బెస్ట్'' అని ప్రకాష్ రాజ్ తో పవన్ కల్యాణ్ చెబుతాడు. దానికి చిరునవ్వుతో ప్రకాశ్ రాజ్ 'థ్యాంక్స్' చెబుతారు. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో విలక్షణ నటుడు ఓడిపోయి బాధ పడటంతో కొందరు సినీ అభిమానులు ఈ వీడియోను తెగ్ వైరల్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ రాజీనామా ను అంగీకరించడం లేదని మంచు విష్ణు అన్నారు. ప్రకాశ్ రాజ్ గారి ఐడియాస్ - సలహాలు - పెద్దరికం 'మా' కు కావాలని.. అందరం కలిసి అసోసియేషన్ అభివృద్ధి కి కృషి చేస్తామని విష్ణు తెలిపారు.