ఓ సినిమా టైటిల్‌లోకి ఎవరైనా ప్రముఖ వ్యక్తి పేరు వచ్చి చేరితే సదరు వ్యక్తి ఓమారు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తన ఇమేజ్‌కి సంఘంలో పరువు ప్రతిష్ఠల సమస్య అనుకునేవారెందరో. ఆ కోవలోనే అప్పట్లో రామ్‌గోపాల్ వర్మ తన సినిమాకి టైటిల్‌గా 'శ్రీదేవి' అని పెట్టుకుంటే ఊరంతా గోలైంది. చివరికి ఆనోటా ఈనోటా శ్రీదేవి చెవిన విషయం పడ్డాక సీరియస్ అయ్యింది. నా పేరుతో సినిమా తీయొద్దు అని రామూని ప్రధాయపడాల్సిన సన్నివేశమే వచ్చింది. అలాగే మే హూ రజనీకాంత్ అంటూ సూపర్‌స్టార్ పేరును ఉపయోగించుకుంటూ పెట్టిన టైటిల్‌పై రజనీకాంత్ అడ్డు చెప్పారు. ఆ సినిమా కథాంశంలో తనని విమర్శించే, తక్కువ చేసి చూపించే సన్నివేశాలు ఉంటాయోమోననే భయంతోనే అలా చేశారు. ఏదేమైనా ఇప్పుడు అదే కోవలో విద్యాబాలన్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందునా తెలుగులో. వేరీజ్ విద్యాబాలన్ ? అన్నదే టైటిల్. ఈ టైటిల్ గురించి బాలన్‌కి తెలిసి .. అవునా పెట్టుకున్నారా! అయితే పెట్టుకోనివ్వండి. అందులో తప్పేం ఉంది? అంటూ ఎదురు ప్రశ్నించిందిట. ముర్ఖులు మాత్రమే ఇలాంటివాటిపై రభస చేస్తారు అనేది విద్యా బాలన్ ఉద్ధేశ్యమేమో!!