ఎన్టీఆర్ కి వదినగా ఆ హీరోయిన్

Update: 2016-03-31 08:16 GMT
హీరోయిన్ శాన్వి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలనే చేసింది. ఇక్కడ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో హఠాత్తుగా శాండల్ వుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నించడం.. అక్కడ పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో.. ఈమె కెరీర్ నిలిచిపోయిందనే చెప్పాలి. ఈ భామకు విదిష అనే సోదరి కూడా ఉంది. ఈమె కూడా హీరోయినే కావడం విశేషం. అత్తిలి సత్తిబాబు లాంటి చిత్రాలతో పాటు రీసెంట్ గా దేవరాయ అనే మూవీలో శ్రీకాంత్ కు జోడీగా నటించింది కూడా.

ఇప్పుడీ భామకు ఓ భారీ చిత్రంలో ఆఫర్ దక్కడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ లో విదిషకు ఓ మంచి కేరక్టర్ దక్కింది. జనతా గ్యారేజ్ లో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇతనికి జోడీగా ఇప్పుడు విదిషను ఎంపిక చేశారు. అంటే పాత్ర ప్రకారం ఈమె.. యంగ్ టైగర్ కు వదిన రోల్ చేస్తోందన్న మాట. ఇప్పటికే విదిషతో సన్నివేశాల చిత్రీకరణ కూడా ప్రారంభమైపోయింది.

ఎన్టీఆర్ - మోహన్ లాల్ - ఉన్ని ముకుందన్ కాంబినేషన్ లో విదిష సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. కెరీర్ సందిగ్ధంలో పడిపోయిన స్థితిలో విదిషకు వచ్చిన ఈ ఛాన్స్.. బంపర్ ఆఫర్ అనాల్సిందే. జనతా గ్యారేజ్ మూవీతో ఈమె కెరీర్ పట్టాలెక్కే అవకాశాలున్నాయని అంచనా.
Tags:    

Similar News