సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల నోటి నుంచి వచ్చే మాట ఒక్కటే. సినిమా చేయటం వరకు మాత్రమే తమ కర్తవ్యమని.. జయాపజయాల్ని పెద్దగా పట్టించుకోమని చెబుతారు. కొందరైతే.. సినిమా పూర్తి అయితే దాని ఫలితం గురించి అస్సలు పట్టించుకోనని తేల్చి చెబుతారు. అయితే.. బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్యాబాలన్ మాత్రం చాలా డిఫరెంట్. ఆమె చేసే ఏ సినిమా అయినా సరే పర్సనల్ గా తీసుకుంటుందట.
తాను చేసిన సినిమా కానీ ప్లాప్ అయితే.. ఇక ఆమె ఆవేదనను ఆపటం ఎవరికీ సాధ్యం కాదని చెబుతోంది. నటనతో పాటు.. గ్లామర్ ను పండించేందుకు సైతం సై అనేలా ఉండే విద్యాబాలన్ ఇమేజ్.. మిగిలిన బాలీవుడ్ భామలకు భిన్నమైందని చెప్పాలి. ఇటీవల ఆమె నటించిన బేగం జాన్ పెద్దగా వర్క్ వుట్ కాలేదు. ఆ మాటకు వస్తే.. ఇటీవల కాలంలో ఆమె నటించిన వరుస సినిమాలు నిరాశ పరుస్తూనే ఉన్నాయి. కష్టపడి పని చేసిన సినిమా పోతే.. గుండె పగిలిపోయేంతగా బాధ ఉంటుందని ఆమె చెబుతున్నారు.
తాను నటించిన సినిమా ప్లాప్ అయితే.. ఓ రూంలో కూర్చొని ఎవరితోనూ మాట్లాడకుండా ఉండదట. తనతో ఎవరో ఒకరు మాట్లాడటానికి ఉండాలని చెబుతోంది. ప్లాప్ అయిన బాధతో ఏడ్చేస్తుందట. అలా ఏడ్చి తన బాధను తీర్చుకుంటుందట. తన బాధను తన తర్వాతి సినిమా మీద చూపిందనని.. కాకుంటే సినిమా పోయినందుకు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు చెబుతోంది. చూస్తుంటే విద్యాబాలన్ సినిమాల్ని మరీ పర్సనల్ గా తీసుకుంటున్నట్లు కనిపించట్లేదు.