ఎన్టీఆర్ అబిడ్స్ ఇంట్లో విద్యా బాలన్

Update: 2018-09-01 05:25 GMT
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.   నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా ప్రముఖ  బాలీవుడ్ నటి - నేషనల్ అవార్డు విన్నర్ విద్యా బాలన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటిస్తోంది.   ఎన్టీఆర్ మొదటి భార్య అయిన స్టొరీ బసవతారకం దృష్టికోణం నుంచే ఈ సినిమా నేరేషన్ ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం ఎన్టీఆర్ దాదాపు దశాబ్దానికి పైగా నివసించిన ఆబిడ్స్ లోని ఇంటిలో జరుగుతోందట.  బంజారా హిల్స్ నివాసానికి మారకమునుపు - తన రాజకీయ జీవితం మొదలు పెట్టిన దశలో ఎన్టీఆర్ ఈ ఇంట్లోనే  ఉండేవారట.  వీలయినంతవరకూ రియల్ లొకేషన్స్ లోనే షూటింగ్ చేయాలని నిశ్చయించుకున్న 'ఎన్టీఆర్' టీమ్ దానికి అనుగుణంగానే ఆబిడ్స్ ఇంట్లో షూటింగ్ చేస్తున్నారట.  ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఈ ఇంట్లో జరిగిన కీలకమైన ఎపిసోడ్స్ ను ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్నారట.

ఈ ఇంట్లో షూటింగ్ చేస్తున్న సమయంలో బాలయ్య కాస్త ఎమోషనల్ అయ్యారట.  మరోవైపు క్రిష్ & టీమ్ ఆన్-లొకేషన్ ఫోటోలు వీడియోలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నారట. 
Tags:    

Similar News