ప్రముఖ హాస్య నటి విద్యుల్లేఖ రామన్ వ్యాపారవేత్త.. ఫిట్నెస్ నిపుణుడు సంజయ్ ని పెళ్లాడారు. 2012 లో గౌతమ్ మీనన్ తమిళ చిత్రం నీతనే ఎన్ పొన్వసంతం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన విద్యుల్లేఖ రామన్ ఆగస్టులో చెన్నైకి చెందిన శాకాహారి ఆరోగ్య ఆహార దుకాణ యజమానితో నిశ్చితార్థం చేసుకుంది.
తెలుగు- తమిళ చిత్రాలలో హాస్య పాత్రలు పోషించడం ద్వారా పాపులరైన విద్యుల్లేఖ ఇటీవల తన అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు శిక్షకుడు సంజయ్ ని కలిసారు. ఫిట్ నెస్ కన్సల్టెంట్ సంజయ్ తో స్నేహం ప్రేమగా మారింది. అనంతరం పెద్దల అంగీకారంతో 09 సెప్టెంబర్ ఈ జంట వివాహం తమిళ సాంప్రదాయంలో ఘనంగా జరిగింది. ఇంతకుముందే ఆమె తన రోకా వేడుక నుండి కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.
విద్యుల్లేఖ- సంజయ్ జంట పెళ్లి ఫోటోలు ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారాయి. ``కీటో శాకాహారి గౌర్మెట్ ఉత్పత్తులను విక్రయించడంలో నైపుణ్యం కలిగిన కీటో చెన్నై అనే స్టోర్ ను సంజయ్ నిర్వహిస్తున్నారు. మాకు రోకా వేడుక జరిగింది. నేను మా రోకా వేడుక (అధికారిక ప్రకటన) 26.08.2020 న మా దగ్గరి కుటుంబంతో సన్నిహిత పద్ధతిలో జరుపుకున్నాను. మీ శుభాకాంక్షలతో మాకు విషెస్ అందించినందుకు చాలా ధన్యవాదాలు!`` అని విద్యుల్లేఖ ఇంతకుముందు సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు. భర్త సంజయ్ కి చెందిన స్టోర్స్ కి విద్యుల్లేఖ బ్రాండింగ్ చేస్తుండడం ఆసక్తికరం.
2012 లో గౌతమ్ మీనన్ యొక్క తమిళ చిత్రం నీతనే ఎన్ పొన్వసంతం అనే చిత్రంలో జీవు అనే పాత్రలో నటించింది విద్యుల్లేఖ సమంత అక్కినేని తో సహాయక పాత్రలో తనదైన హాస్యం భాష యాసతో అలరించింది. ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు - తమిళ పరిశ్రమలలో 30 కి పైగా చిత్రాలలో నటించింది.
కానీ ఇటీవల బరువు తగ్గడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాల్లో ఉంది. తనని నెటిజనులు నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేయడం తెలిసిందే. విద్యుల్లేక ఇటీవల తన మేకోవర్ కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇటీవల తన ఫిట్నెస్ పై ఎంతో ఎమోషనల్ గా ఒక నోట్ ని విద్యుల్లేఖ రాసింది. నేను తేలికగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నానని విద్యుల్లేఖ తెలిపారు.
నిజానికి కేవలం నాలుగైదు నెలల లాక్ డౌన్ సమయంలో ఏకంగా 20 కేజీల బరువు తగ్గడం సాధ్యమేనా? ఇదే ప్రశ్నకు విద్యుల్లేఖ జవాబిస్తూ .. ఎంతో ఉద్వేగానికి లోనైంది. 20 కేజీలు పైగా తగ్గానంటే దానివెనక కఠోర శ్రమ.. కన్నీరు ఉన్నాయి..దీనివెనక పట్టుదలకు కారణమేమిటో చెప్పి ఆవేదనను వ్యక్తం చేసింది. ఓ ఆడియోకి వెళ్లినప్పుడు ఉన్న డ్రెస్ లలో ఏదీ చాలలేదు. దాంతో లెగ్గిన్ వేసుకుని షేమ్ ని దాచుకోవడానికి కోట్ వేసుకున్నా. ఆరోజు నాపై నాకే కోపం వచ్చి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా`` అని తెలిపింది. మనకోసం మనం ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యమేనని విద్యుల్లేఖ అంది.
పెళ్లి తర్వాతా నటిస్తుందా?
విద్యుల్లేఖ ప్రస్తుతం బరువు తగ్గారు. మారిన రూపంతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని చెబుతున్నారు. అయితే ఇలా బరువు తగ్గడం సరికాదని హాస్యనటిగా అవకాశాలు రావాలంటే తాను మునుపటి రూపంతోనే ఉండాలని నిపుణులు సూచించారు. కానీ అవేవీ విద్యుల్లేఖ పట్టించుకోలేదు. ఇక పెళ్లి తర్వాతా నటిస్తుందా లేదా? అన్నది విద్యు స్వంగా వెల్లడించాల్సి ఉంది.