మలయాళ బ్యూటీ అయినా సౌతిండియాకి టాప్ హీరయిన్ అయిన నయనతార ప్రేమ వ్యవహారం ఫైనల్ స్టేజ్ కి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో పడిందన్న మాట ఎప్పటినుంచో వినిపిస్తోంది. వీరిద్దరూ తమ ప్రేమను ఇప్పటివరకూ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. సినిమాటిక్ సీన్స్ ను మాత్రం చూపించారు. రీసెంట్ గా సైమా అవార్డ్ ఫంక్షన్స్ లో ఇలాంటి వ్యవహారమే జరిగింది. కాకపోతే ఈ సారి జనాలకు తమ సంగతి చెప్పేందుకు మరో అడుగు ముందుకేశారు ఈ జంట.
నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న నయన తార.. దాన్ని తీసుకునే సమయంలో దర్శకుడిని స్టేజ్ పైకి పిలిచింది. 'నేనీ పాత్రను చేయగలనని అనుకోలేదు. కానీ నేను తప్ప ఇంకెవరూ చేయలేరంటూ విక్కీ నన్ను ఎంకరేజ్ చేశాడు. స్టేజ్ పై ఉన్న గెస్టులు తప్పుగా అనుకోకపోతే విఘ్నేష్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకుంటాను' అని నయన తార అనడంతో.. వెంటనే కిందనుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నయన్ ని వాటేసుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ ఒక్క సన్నివేశంతో వారిద్దరి మధ్య ఏ రేంజ్ లవ్ నడుస్తోందో అందరికీ అర్ధమైంది.
ఇదే సినిమాకి గాను విఘ్నేష్ కి కూడా అవార్డ్ వచ్చింది. దాన్ని అందుకుంటున్నపుడు ఈ దర్శకుడు చెప్పిన మాటలు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 'నేను కలిసిన మంచి మనుషుల్లో నయనతార అందరికంటే బెస్ట్. స్క్రిప్ట్ చదవడానికి వచ్చినందుకు.. ప్రేమలో పడ్డందుకు థ్యాంక్స్' అన్నాడు విఘ్నేష్. ఇతను చెప్పినదాని ప్రకారం ప్రేమలో పడ్డం అనే మాట పాత్ర గురించి అయినా.. ఆ మాట విన్నపుడు నయన్ నవ్విన నవ్వులు చాలు అసలు విషయం అర్ధం కావడానికి. ఇప్పుడు వీళ్లిద్దరి పెళ్లి గురించి కోలీవుడ్ లో ప్రచారం మొదలైపోవడం విశేషం.