సోషల్ మీడియా విస్తృతం అయిపోయాక స్టార్ హీరోల అభిమానుల మధ్య ఆన్ లైన్ వార్స్ బాగా పెరిగిపోయాయి. తమ హీరోల సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కంటే.. పక్క హీరోల మూవీస్ ని టార్గెట్ చేయడానికి.. ట్రాలింగ్ చేయడానికే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ప్రింట్.. ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా మరింతగా పెంచి పోషిస్తున్నాయి.
గతేడాది బ్రహ్మోత్సవం విషయంలో మహేష్ బాబుపై బోలెడన్ని విమర్శలు వస్తే.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లో పెద్ద ఆర్టికల్ ప్రచురించారు. దీనిపై చాలానే రచ్చ జరిగింది. ఇప్పుడు కోలీవుడ్ లో ఇంతకు మించిన యుద్ధం జరుగుతోంది. రీసెంట్ గా వివేకం చిత్రానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు అజిత్. ఈ పోస్టర్ పై విజయ్ ఫ్యాన్స్ ట్రాలింగ్ మొదలుపెట్టేశారు. వేరే ఎవరో బాడీకి.. అజిత్ ముఖం అతికించారంటూ ఆన్ లైన్ లో ట్రెండింగ్ చేసేశారు. దీన్ని అజిత్ ఫ్యాన్స్ ఖండిస్తున్నా.. ఈ టాపిక్ పై ఓ ఛానల్ పెద్ద స్టోరీ టెలికాస్ట్ చేసింది. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరిపోయింది.
నిజంగా అజిత్ ఇలా బాడీ పెంచి ఉంటే.. మేకింగ్ వీడియో రిలీజ్ చేయాలన్నది విజయ్ ఫ్యాన్స్ డిమాండ్. అజిత్ ఇలాంటి వాటికి దూరం అని.. సినిమా రిలీజ్ అయ్యాక అందిర నోళ్లు మూతపడతాయని అజిత్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ వివాదం అప్పటివరకూ చల్లారడం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/