ఫారిన్‌ అమ్మాయితో దేవరకొండ పెళ్లి అసలు స్టోరీ

Update: 2019-07-07 07:02 GMT
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ' చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి మెచ్యూర్డ్‌ కథతోనే తన తదుపరి చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ షూటింగ్‌ లో కూడా పాల్గొన్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు జోడీగా ఫారిన్‌ బ్యూటీ ఇజాబెల్లితో పాటు రాశిఖన్నా మరియు ఐశ్వర్య రాజేష్‌ లు నటిస్తున్నారు.

ఈ చిత్రం ప్రారంభం విజయ్‌ దేవరకొండ మరియు ఇజాబెల్లి పెళ్లి చేసుకుని ప్రాన్స్‌ లో సెటిల్‌ అవుతారు. అక్కడ సెటిల్‌ అయిన విజయ్‌ దేవరకొండ తన గత ప్రేమ సంగతుల గురించి ఫ్ల్యాష్‌ బ్యాక్‌ తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. తన లవ్‌ ఫెయిల్యూర్స్‌ గురించి హానెస్ట్‌ గా విజయ్‌ దేవరకొండ చెప్పే సీన్స్‌ మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ప్లే బాయ్‌ గా కనిపించబోతున్నాడని.. ముగ్గురు హీరోయిన్స్‌ తో ఫుల్‌ రొమాన్స్‌ చేయబోతున్నట్లుగా అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ ప్లే బాయ్‌ కాదని మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీస్‌ ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News