విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ ప్రాజెక్ట్ ఆగిన‌ట్టేనా?

Update: 2022-09-22 02:30 GMT
రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌రకొండ న‌టించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ `లైగ‌ర్‌`. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ భారీ అంచనాల మ‌ధ్య విడుద‌లై ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కు షాకిచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీతో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవాల‌నుకున్న పూరికి, బాలీవుడ్ లో పాగా వేయాల‌నుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కు `లేగ‌ర్‌` ఊహిచ‌ని షాకిచ్చింది.

ఈ మూవీ త‌రువాత చాలా వ‌ర‌కు స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోయాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూరి జ‌గ‌న్నాథ్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`ని ప్రారంభించాడు. ఓ షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేశారు కూడా. అయితే `లైగ‌ర్` ఫ‌లితంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దీనిపై పూరి కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ కానీ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం.. ఇటీవ‌లై సైమా వేడుక‌ల్లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ప్రాజెక్ట్ గురించి ఇండైరెక్ట్ గా స్పందించ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఇక అట‌కెక్కిన‌ట్టేన‌ని తేలింది.

ఇదిలా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `ఖుషీ` మూవీలో న‌టిస్తున్నాడు. స‌మంత హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. క‌శ్మీర్ లో షూటింగ్ మొద‌లు పెట్టిన ఈ మూవీ కీల‌క ఘ‌ట్టాలని పూర్తి చేసి చిత్ర బృందం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేసింది. ఇక్క‌డ కొన్ని సీన్ లు చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. అయితే స‌మంత యుఎస్ వెళ్లిన నేప‌థ్యంలో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సంబంధించిన క్రేజీ ప్రాజెక్ట్ ఆగిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సుకుమార్ డైరెక్ష‌న్ లో తెలంగాణ సాయుధ పోరాటం నేప‌థ్యంలో ఓ భారీ పీరియాడిక‌ల్ మూవీని చేయాల‌ని ప్లాన్ చేశారు. 2021లో ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించారు. ఫాల్క‌న్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై కేదార్ సెల‌గం శెట్టి నిర్మాత‌గా ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ని 2022లో సెట్స్ పైకి తీసుకెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇంత వ‌ర‌కు దీని గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డం.. సుకుమార్ `పుష్ప 2 ` ప్రాజెక్ట్ తో బిజీగా వుండ‌టంతో ఇప్ప‌ట్లో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News