అన‌వ‌స‌రంగా పార్టీల్ని కెలికాడే!?

Update: 2018-10-01 17:03 GMT
యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ దూకుడు అంత‌కంత‌కు పెరుగుతోంది. అందుకు `నోటా` ప్ర‌మోష‌న్స్ తీరుతెన్నులే ఓ ప్రూఫ్‌. నిన్న‌టికి నిన్న విజ‌య‌వాడ బెంజి స‌ర్కిల్‌ని ఓ ఊపు ఊపాడు. అక్క‌డ ఏపీ అభిమానుల‌తో కిక్కిరిసిపోయే ఈవెంట్‌లో తూటాల్లాంటి మాట‌లు పేల్చాడు. బెజ‌వాడ‌కు సినిమా.. రాజ‌కీయం స్పెష‌ల్ అనేశాడు. మ‌ళ్లీ వ‌స్తే కొత్త‌గా వ‌స్తాన‌ని - అభిమానుల తాకిడికి స‌రిప‌డే వెన్యూ ఎరేంజ్ చేస్తాన‌ని అన్నాడు.

ఈరోజు నైజాం అభిమానుల్ని ఉద్ధేశించి మ‌రో మాట అన్నాడు.  నిన్న ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ రెస్పాన్స్ మాములుగా లేదు. అంతకు మించి నైజాంలో రెస్పాన్స్ ఉంది.. అంటూ లోక‌ల్ ఫ్యాన్స్‌ లోనూ సెంటిమెంటును రంగ‌రించాడు. దాంతోపాటే రాజ‌కీయ పార్టీల గురించి ప్ర‌స్థావిస్తూ.. కాంట్ర‌వ‌ర్శీని కెలికాడు. ``మా సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా చేస్తున్నారు. అఫడవిట్లు పెడుతున్నారు..  ఎలక్షన్స్ టైం లో  వస్తుండడంతో అంద‌రూ ``నోటా బటన్`` నొక్కేస్తారని భ‌య‌ప‌డుతున్నారు. తెలంగాణ లో ఒక పార్టీ కి ఫేవర్ గా ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు..`` అంటూ బాంబ్ వేశాడు. అయితే అలాంటి ఇష్యూస్ ఈ సినిమా లో లేనే లేవు.. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

సినిమా చూసి ఓటు వేసే లేదా వేయ‌ని పరిస్థితిలో ప్రజలు లేరు. వాళ్లకు తెలుసు ఏం చేయాలో. అక్టోబర్ 5 న మీ అందరికి ఓ కొత్త ఫ్రెష్ సినిమా ఇస్తున్నాం. నోటా సరికొత్త పొలిటికల్ ఎంటర్టైనర్. టైం లేదు.. కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజులే ఉంది. నోటా అందరికి నచ్చుతుంది అంటూ హుషారు పెంచాడు. మొత్తానికి  దేవ‌ర‌కొండ ప్ర‌చార‌శైలి చాలా డిఫ‌రెంటుగానే సాగుతోంది.
Tags:    

Similar News