ముంబై కి స్పీడెక్కువ‌.. నేను లేజీగా ఉన్నా నా స్పీడ్ నాదే!

Update: 2021-09-09 04:30 GMT
లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్ప‌టికే బాలీవుడ్ లో అత‌డి పేరు మార్మోగుతోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో లైగ‌ర్ అత్యంత భారీగా విడుద‌ల కానుంది. కరణ్ విజయ్ కి కావాల్సిన ప్ర‌మోష‌న్స్ అందిస్తున్నారు.  విజయ్ బ్రాండ్ అసోసియేషన్ లు ధర్మ గ్రూప్ ద్వారా ప్ర‌మోట‌వుతున్నాయి.

విజయ్ తరచుగా షూటింగుల‌ కోసం ముంబైకి వెళ్లి బి-టౌన్ పార్టీలకు హాజరవుతూ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అతను పార్టీ క్రౌడ్ విన్యాసాల‌తో పెద్దగా మారలేదు. అతని పని శైలి ఎప్ప‌టిలానే అలాగే ఉంది. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై చాలా వేగవంతమైన ప్రపంచమని అక్కడ ప్రతిదీ చాలా వేగంగా జరుగుతుందని విజయ్ తెలిపారు. అక్కడ ప్రజలు అనుక్ష‌ణం తిరుగుతూ ఉంటార‌ని వారు అన్ని సమయాలలో వేకువ‌గానే ఉంటారని ఆయన చెప్పారు.

విజయ్ తాను `సోమరితనం` ఉన్న‌వాడిన‌ని.. తనదైన‌ స్వంత వేగంతో పనిచేసే హైదరాబాదీని అని చెప్పాడు. హైదరాబాద్ నుండి వచ్చిన వ్యక్తులు చాలా ప్రొఫెషనల్ అని పని కోసం వారు తమ శ్రమను ధార‌పోస్తార‌ని అన్నారు. అయితే హైదరాబాద్ ఒక నిర్దిష్ట వేగంతో పనిచేస్తుందని తెలిపారు. విజయ్ తనకు ముంబై అంటే చాలా ఇష్టమని కానీ అతను హైదరాబాద్ లో నివ‌శిస్తున్నాన‌ని చెప్పాడు. అలాగే కెరీర్ ప్రారంభ రోజుల్లో అతను తన మూలాలను పోరాటాలను మరచిపోలేదు.

ముంబైకి తన రెగ్యులర్ సందర్శనల గురించి మాట్లాడుతూ.. పని మీద ఎప్పుడో ఒకసారి డ్రీమ్స్ సిటీని సందర్శిస్తానని తెలిపాడు. త‌న బాలీవుడ్ ఎంట్రీ మూవీ లైగ‌ర్ విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు విజ‌య్. ఈ చిత్రానికి పూరి ద‌ర్శ‌కుడు. పూరి-ఛార్మి నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే క‌థానాయికా న‌టిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేసేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.
Tags:    

Similar News