ట్రెండీ టాక్‌: అప‌రిచితుడు `రెమో`లా చూపిస్తాడా?

Update: 2021-06-22 07:30 GMT
త‌న క‌థానాయ‌కుల ఇమేజ్ పెంచ‌డంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కి అరుదైన రికార్డ్ ఉంది. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడిగా అత‌డికి గుర్తింపు ఉంది. పూరి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్లు కొట్ట‌డం వెన‌క అత‌డు డిజైన్ చేసే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌ధాన కార‌ణం. అలాగే క‌థానాయ‌కుల రూపు రేఖ‌ల్ని అమాంతం మార్చేయ‌డం అత‌డికే చెల్లింది. రామ్ చ‌ర‌ణ్‌- అల్లు అర్జున్ - ర‌వితేజ‌- తార‌క్- క‌ళ్యాణ్ రామ్- నితిన్ ఇలా ఎంద‌రో హీరోల్ని పూరి డిజైన్ చేసిన తీరు లుక్ ప‌రంగా మార్చేసిన విధానం నిరంత‌రం హాట్ డిబేట్ కి తెర తీసిన వైనం తెలిసిన‌దే.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ వంతు. పూరి కాంబినేష‌న్ మూవీ లైగ‌ర్ కోసం విజ‌య్ ఇప్ప‌టికే చాలా మారాడు. అత‌డి మ్యాకో రూపం ఇటీవ‌ల ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జిమ్ చేసి కండ‌ల హీరోలా మారాడు. యాబ్స్ ప‌రంగా చాలా ఛేంజ్  క‌నిపిస్తోంది. ఆ పొడ‌వాటి గిర‌జాల జుత్తు ఇత‌ర‌త్రా డిజైన‌ర్ స్టైలింగ్ ప్ర‌తిదీ పూరి చ‌లువే. ఇక లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ ని చూసాక మ‌గువ‌లు మ‌న‌సు ప‌డిపోవ‌డం ఖాయం అన్న చ‌ర్చా సాగుతోంది.

విజయ్ ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపించ‌నున్నాడు. దీని కోసం అతడు చాలా శ్ర‌మించి రూపం మార్చాడు. మారిన ఈ కొత్త లుక్ తో నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేలా ఒక సూపర్ హాట్ సాంగ్ ను పూరి ప్లాన్ చేసార‌ట‌. రౌడీ మహిళా అభిమానులను ఆకర్షించడానికి ఇంతకుముందెన్నడూ తెరపై చూడని విధంగా చూపించేందుకు ప్లాన్ చేశార‌ని తెలిసింది. ఈ పాట ఆద్యంతం విజ‌య్ తన హాట్ లుక్స్ ని ప్ర‌ద‌ర్శిస్తాడు. చొక్కా విప్పి కండ‌లు ప్ర‌ద‌ర్శిస్తాడు. 6 -ప్యాక్ యాబ్స్ తో మ‌తులు చెడ‌గొడ‌తాడు. ఇక అత‌డి భంగిమ‌లు మగువ‌ల‌కు పిచ్చెక్కించేస్తాయ‌ని కూడా చెబుతున్నారు. ఒక ర‌కంగా అప‌రిచితుడులో రెమో సాంగ్ రేంజులో ఈ పాట ఉండొచ్చ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

ఒక పాన్ ఇండియా స్టార్ గా దేవ‌ర‌కొండ క్రేజును పెంచేందుకు పూరి చేయాల్సిందంతా చేస్తున్నారు. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌తో అటు ఉత్త‌రాది ఆడియెన్ లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ భారీ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక లైగ‌ర్ లో ఆ ఒక్క పాట‌తో అత‌డి రేంజే మారిపోతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News