విజయ్ దేవరకొండ.. ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో తెరకి పరిచయమైన విజయ్ తొలి చిత్రంతోనే నటుడిగా ఆకట్టుకున్నాడు. అందం, సహజమైన స్మయిల్, ఎక్స్‌ప్రెషన్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి పాత్రలో ప్రత్యేకంగా కనిపించాడు. సినిమా హిట్టయ్యింది. ఈసారి ఏకంగా సోలో హీరోగా ఛాన్స్ పట్టేశాడు.
అదీ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ శిష్యుడు రమణ మల్లం దర్శకత్వంలో నటించే అవకాశం అందుకున్నాడు. రమణ మల్లం గౌతమ్ మీనన్ సినిమాలతో పాటు విక్రమ్.కె.కుమార్ వద్ద 'మనం' చిత్రానికి కూడా పనిచేశారు. ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన కథలో నటిస్తున్నాడు. గౌతమ్‌మీనన్, విక్రమ్.కె.కుమార్ గొప్ప టెక్నీషియన్స్. చక్కని అభిరుచి ఉన్న దర్శకులు. వాళ్ళ దగ్గర పనిచేశాడు కాబట్టి, రమణ ఆ రేంజిలోనే సినిమా తీస్తాడని, విజయ్‌కి విజయం ఇస్తాడని ఆశిద్దాం. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న యువనటుల్లో డిసిప్లయిన్ వల్ల కెరీర్‌ని నాశనం చేసుకున్నవారిని ఉదాహరణలుగా తీసుకుని అలాంటి తప్పులేవీ రిపీట్ చేయకుండా కుర్రాడు ముందుకుపోతే సరి...