విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' చిత్రం సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. మరి కొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. చాలా రోజులుగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ ఇప్పటికే విజయ్ దేవరకొండను బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు.
డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ ఆ రీమేక్ లో నటించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను హిందీ రీమేక్ లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్నది డియర్ కామ్రేడ్ చిత్రంతో కాదని క్లీయర్ గా చెప్పేశాడు.
సౌత్ లో విడుదలైన తర్వాత డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ పనులు మొదలు కాబోతున్నాయి. హిందీ వర్షన్ కు కూడా భరత్ కమ్మను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రం తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చిత్రంను చేస్తున్నాడు. మరో వైపు 'హీరో' అనే చిత్రాన్ని కూడా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది వచ్చే అవకాశం ఉంది. సౌత్ లోనే ప్రస్తుతానికి సత్తా చాటి కాస్త ఆగి బాలీవుడ్ కు విజయ్ దేవరకొండ వెళ్లే అవకాశం ఉంది.