గతేడాది వచ్చిన సెన్సేషనల్ అర్జున్ రెడ్డి. చిన్న సినిమా అయినా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇందుకు ప్రధాన కారణం.. యాంగర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ను హీరో విజయ్ దేవరకొండ అద్భుతంగా పోషించిన తీరు. ఈ పాత్ర విజయ్ దేవరకొండ కోసమే పుట్టిందని అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే.. ఇప్పుడీ సినిమా మరో రెండు భాషల్లో రీమేక్ అవుతోంది. తమిళ్ లో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డిని రీమేక్ చేస్తున్నారు. హిందీకి వెళ్లేసరికి ఈ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. రెండు భాషలలో దేనినుంచీ విజయ్ దేవరకొండకు పిలుపు రాకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఓ పాత్రకు నటుడిని ఎంచుకోవడం అనేది దర్శకుడి అంశం అంటున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి కోసం తాను ఏం చేయగలనో అంతా చేశానని.. సందీప్ వంగా తన సన్నిహితుడు కావడంతో తనకు ఆఫర్ చేశాడని అన్నాడు ఈ యంగ్ హీరో.
'మళ్లీ అదే సంక్లిష్ట పాత్రలో నటించడం నాకూ కష్టమైన విషయమే. రిపీట్ చేసినట్లుగా అనిపిస్తుంది. దానికంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చేసుకోవడం బెటర్' అంటూ తన వరకూ అర్జున్ రెడ్డి ఫినిష్ అని చెప్పేశాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తెలుగు.. తమిళ్ మూవీస్ చేస్తున్నానని.. బాలీవుడ్ నుంచి పిలుపు వస్తే పాత్ర నచ్చితే తప్పక చేస్తానని చెబుతున్నాడు ఈ సెన్సేషనల్ హీరో.