'అర్జున్ రెడ్డి` - `గీత గోవిందం` చిత్రాలతో సంచలన విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవేరకొండ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ ఫెవరెట్. అతడి సినిమా వస్తోందంటే దానిపై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయ్. త్వరలో విజయ్ నుండి రాబోతున్న సినిమా `నోటా`. ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలోనే వున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో బోలెడంత మెలోడ్రామా నడవడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు మనసు మార్చుకున్న సినిమా టీమ్ ఇంకా చాలా ముందుగానే రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది.
కానీ ఏ తేదీన విడుదల చేయాలన్న దానిపైన నిర్మాతలకు క్లారిటీ లేదు. దీంతో ట్విట్టర్ వేదికగా విజయ్ దేవేరకొండ తన సినిమా విడుదల తేదీని తెలపండి అంటూ అక్టోబర్ 5 - లేదా 10 - లేదా 18 న విడుదల చేయాలా అని మూడు తేదీలలో ఏది బెటర్ గా ఉంటే దాన్ని ఫైనల్ గా తెలపండని ట్విట్టర్ పోల్ ని నిర్వహిస్తున్నాడు. ఈ పోల్ లో పాల్గొన్న మెజారిటీ పీపుల్ `నోటా`ను అక్టోబర్ 5 నే విడుదల చేయాలని సూచించారు.
అయితే `నోటా` విడుదల తేదీ కోసం విజయ్ దేవేరకొండ ట్విట్టర్ పోల్ నిర్వహించడానికి మరో కారణం కూడా ఉందని తెలిసింది. ఈ సినిమా దసరా బరిలో విడుదల కాకుండా తేదీని మార్చుకోమని కొంతమంది నిర్మాతలు - డిస్ట్రిబ్యూటర్స్ `నోటా` టీమ్ పై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో అప్సెట్ అయినా దేవరకొండ 'నోటా' విడుదల తేదీ కోసం ట్విట్టర్ లో పోల్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చాడని చెబుతున్నారు. మరి కొన్ని గంటల్లో ట్విట్టర్ పోల్ ద్వారా `నోటా` రిలీజ్ డేట్ ను విజయ్ నిర్ణయించబోతున్నాడు. వన్స్ డేట్ ఫిక్స్ అయిపోతే ప్రచారంతో దుమ్ము లేపాలని రౌడీ మంచి ప్లానింగులో వున్నాడట.