అది వేరు ఇది వేరంటున్న దేవరకొండ!

Update: 2018-07-29 10:19 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' సినిమాలోని 'వాట్ ద ఎఫ్' లిరికల్ సాంగ్ వివాదాస్పదం కావడం, ఆ తర్వాత మేకర్స్ ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించడం తెలిసిందే.  ఈ పరిణామం పై విజయ్ దేవరకొండ రీసెంట్ గా స్పందించాడు.   ఎవరి సెంటిమెంట్స్ ను హర్ట్ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నాడు. అదొక ఫన్ సాంగ్ మాత్రమేనని, సినిమాకు ఖచ్చితంగా అవసరమైన పాట కాదని.. సో - లిరిక్స్ మార్చినా పెద్దగా ఇబ్బందేమీ లేదన్నాడు..

ఈ వివాదం వేరు 'అర్జున్ రెడ్డి' రిలీజ్ సమయంలో వచ్చిన వివాదం వేరన్నాడు.  'అర్జున్ రెడ్డి'  ఒక బోల్డ్ సినిమా అని అందులో ఆ స్టొరీకి తగ్గట్టు  కిస్ సీన్లు - డైలాగ్స్ ఉన్నాయని కానీ అవి స్టొరీ కి అవసరం కావడంతో తను గట్టిగా వాటిని సమర్థించానని చెప్పాడు.  కానీ 'గీత గోవిందం' ఒక డిస్నీ.. బరజాత్య స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నాడు. ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి  - వాళ్ళ సెంటిమెంట్స్ ను గౌరవించి  ఎఫ్ సాంగ్ ను వేరే పాటతో రీప్లేస్ చేస్తామని చెప్పాడు. వాళ్ళకు ఈ సాంగ్ తో ఇబ్బంది ఉంది కాబట్టి పాటను తీసెయ్యడానికి మాకేమీ అభ్యంతరం లేదన్నాడు.

తను సింగర్ అవతారం ఎత్తడానికి కారణం నిర్మాత - దర్శకులేనని చెప్పాడు.  ఇప్పట్లో మరో పాట పాడే ఆలోచన లేదన్నాడు. ఏదేమైనా విజయ్ మొదటి సాంగ్ ఇలా వివాదాస్పదం కావడం - యూట్యూబ్ నుండి తొలగించాల్సి రావడం అభిమానులను నిరాశకు గురిచేసే పరిణామాలే.
Tags:    

Similar News