వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విజయ్ దేవరకొండ టీమ్...!

Update: 2020-09-13 12:10 GMT
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పేరు ఉపయోగించుకుని కొందరు తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నాయని విజయ్ టీమ్ పేర్కొంది. ఇటీవల కొంతమంది వ్యక్తులు తమకు విజయ్ దేవరకొండ టీం తో సంబంధాలు ఉన్నాయని పలు తప్పుడు ఆడిషన్స్ చేస్తున్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని విజయ్ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అలాంటి వారిని నమ్మొద్దని.. విజయ్‌ దేవరకొండ తన సినిమాల గురించి అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. ''విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. విజయ్ సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ నటీనటులను సంప్రదిస్తున్నాయి. విజయ్‌ నటించబోతున్న ఏ సినిమా అయినా సరే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారు. విజయ్‌ దేవరకొండ తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వాటిని నిర్ధారిస్తారు. విజయ్ దేవరకొండ పేరును దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోబోతున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని.. ఏదైనా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరుతున్నాం'' అంటూ విజయ్‌ దేవరకొండ టీమ్ పేర్కొంది.

కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'ఫైటర్‌' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరీ - ఛార్మీ - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్‌ జరుపుకోగా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' వంటి పరాజయం తర్వాత వస్తున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Tags:    

Similar News